మళ్లీ నోరుపారేసుకున్న జగన్.. బాబును నాలుగు తన్నాలంట

Jagan tongue slip on chandrababu naiduనంధ్యాల ఉపఎన్నిక సంధర్భంగా ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద ఉరితీయాలని, కాల్చి చంపాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే ప్రజలు ఆ వ్యాఖ్యలు హర్షించకపోవడంతో ఆ ఎన్నికలలో వైకాపా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. నంద్యాలలో చిత్తుగా ఓడిపోయింది.

పెద్దంతరం చిన్నంతరం లేకుండా చేస్తున్న అటువంటి మాటలు జగన్ ఫ్యాక్షన్ మెంటాలిటీని సూచిస్తున్నాయి అని టీడీపీ ప్రజలను కన్విన్స్ చెయ్యగలిగింది. అయితే జగన్ పాఠాలు నేర్చుకున్నట్టు లేరు. చంద్రబాబు పేరు ఎత్తితేనే జన్మజన్మల పగ ఉన్నట్టు రెచ్చిపోయే ఆయన ఆదివారం మరోసారి రెచ్చిపోయారు.

ADVERTISEMENT

ఓటుకు నోటులో దొరికిపోయినప్పుడు ఆయనను నాలుగు తన్ని నిలదీసి ఉంటె అంతా చెప్పేవాడని జగన్ అన్నారు. కనీసం చంద్రబాబు స్థానానికి గానీ, వయసుకు గానీ, గౌరవం ఇవ్వకపోవడం జగన్ కె చెల్లింది. ఇటువంటి భాషను ప్రజలు ఆమోదిస్తారు అని ఆయన ఎలా అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి మరి.

ADVERTISEMENT
Latest Stories