జగన్‌-చంద్రబాబు పర్యటనలలో ఎంత తేడా!

Jagan vs CBN Tours: Stark Contrast Seen

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్యలని అడిగి తెలుసుకునేందుకు వేలాదిమంది కార్యకర్తలని, వాహనాలతో ఊరేగింపుగా వెళ్ళి ఎంత హడావుడి చేశారో అందరూ చూశారు. కేవలం 10 మంది ఎమ్మెల్యేలున్న ఓ ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు ఇంత హడావుడి చేస్తే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు బయలుదేరితే మరెంతగా హడావుడి చేయాలి?

ADVERTISEMENT

ఆయన కోరుకుంటే వందల వాహనాలు, వేలామంది పార్టీ శ్రేణులు తరలిరారా?అంటే తప్పక వస్తారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు పర్యటనలు ఎంత నిరాడంబరంగా జరుగుతాయో తెలుసుకోవాలంటే ఈ నెల 1వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మలకపల్లి గ్రామ పర్యటన చూస్తే అర్దమవుతుంది.

ఆయన వెంట జిల్లాకు చెందిన కొద్దిమంది ముఖ్య నేతలు తప్ప మరెవరూ లేరు. సిఎం చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్‌లో మలకపల్లి గ్రామానికి చేరుకున్నాక తనకు స్వాగతం చెప్పడానికి ఎదురుచూస్తున్న గ్రామస్తులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కొందరి ఇళ్ళకు వెళ్ళి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకొని పింఛన్లు అందజేశారు.

ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత నిరాడంబరంగా, ఇంత హుందాగా వ్యవహరిస్తుంటే కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న జగన్‌, పరామర్శ యాత్రల పేరుతో ఇంత హడావుడి చేస్తున్నారు.

తన బల ప్రదర్శనని రాష్ట్ర ప్రజలందరూ చూడాలని, చూసి గుర్తించాలని జగన్‌ కోరుకుంటున్నారు. ప్రజలు చూస్తున్నారు కూడా. కనుక ప్రజలు తప్పకుండా సిఎం చంద్రబాబు నాయుడు, జగన్‌ ఇద్దరి తీరుని బేరీజు కూడా వేసి చూస్తూనే ఉంటారు.

సమయం వచ్చినప్పుడు సరైన తీర్పు ఇస్తారని 2024 ఎన్నికలలో నిరూపించారు కూడా. మరోసారి తప్పక నిరూపిస్తారు కూడా.

ADVERTISEMENT
Latest Stories