revanth-reddy-and-ktr

నిన్న కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల అంశం అన్ని రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తునట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జమిలికి వ్యతిరేకంగా తమినాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ గళం వినిపించారు.

ఇక జమిలి మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు ఇటు వైసీపీ కానీ, అటు బిఆర్ఎస్ కానీ ప్రభుత్వం మీద సమరశంఖం మోగించడానికి సిద్ధమయ్యారు. అలాగే ప్రభుత్వాలు కూడా ఇక గత పాలకులు చేసిన తప్పిదాలను ప్రజల ముందుంచి వాటికీ తగ్గ ప్రతిఫలాన్ని ఆయా పార్టీల నేతలకు తిరిగి వడ్డించే పనిలో ఉన్నట్టు ఉహాగానాలు మొదలయాయ్యి.

Also Read – సైఫ్‌కి టాలీవుడ్‌ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?

ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం తన తొలి అడుగును వేయడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి కూడా రేవంత్ సర్కార్ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను ఉద్దేశించి ‘ఫోన్ టాపింగ్’ వ్యవహారం గురించి, ఆయన హయాంలో జరిగిన ‘ఫార్ములా ఈ’ కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు చేస్తుంది.

అలాగే అటు కేటీఆర్ కూడా దమ్ముంటే తనను అరెస్టు చేయాలంటూ రేవంత్ సర్కార్ కు సవాల్ మీద సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి.

Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్‌ విధ్వంసానికి…

కేటీఆర్ అరెస్టు నేపథ్యంలో ఇటు మీడియా దృష్టితో పాటుగా అటు ప్రజల దృష్టిని ఏమార్చడానికే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు ను తెరమీదకు తెచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నుంచి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టయ్యి దాదాపు ఆరు నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు.

ఇక ఇప్పుడు కేటీఆర్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసి గత పదేళ్ల బిఆర్ఎస్ పాలన మొత్తం బంగారు తెలంగాణ కోసం కాదు వీరి బంగారు కుటుంబం కోసం అని ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే బిఆర్ఎస్ నేతలకు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజల భావోద్వేగాలు ఎలా రెచ్చకొట్టాలి, ఎలా అణచి వేయాలి అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య వంటింది.

Also Read – అందరికీ పంచింగ్ బ్యాగ్ మన టాలీవుడ్‌?


అలాంటి పరిస్థితులలో కేటీఆర్ అరెస్టు అంటే రేవంత్ సర్కార్ ఒక పెద్ద సాహసం చేస్తున్నట్లే అని చెప్పాలి. అయితే ప్రభుత్వం కూడా వీరి అవినీతి మీద రాజకీయ విమర్శలు కాకుండా తగిన సాక్షాలు చూపించి ప్రజలను నమ్మించగలిగితే అప్పుడు రేవంత్ సాహసానికి తగిన ఫలితం దక్కుతుంది. లేదంటే బాబు అరెస్టు విషయంలో జగన్ బోర్లా పడినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తగిన మూల్యాన్ని చెల్లించక తప్పదు.