ప్రశాసన్‌నగర్‌లోని జనసేన కార్యాలయంలో కాసేపటి క్రితం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ఎక్కువే ఇచ్చామని కేంద్రంలోని భాజపా చెబుతోందని.. మరోవైపు రాష్ట్రానికి రావాల్సినవేవి సక్రమంగా రావడంలేదని అంతా అస్తవ్యస్తంగా ఉందని రాష్ట్రం చెబుతోందన్నారు.
కచ్చితంగా ఇద్దరిలో ఒకరు మాత్రం అబద్ధం ఆడుతున్నారని చెప్పారు. అదేవరో తేల్చాలని అన్నారు. అందుకే ఉండవల్లి, జేపీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఈ మాత్రం దానికి ఉండవల్లి, జేపీ లాంటివారు అవసరమా, ఎవరితోనైనా నాలుగు ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టిస్తే అవే తేలిపోతాయిగా.
నిజంగా ఉండవల్లి పవన్ కళ్యాణ్ కు, జనసేనకు సహకరించేలా ఉంటే ఫక్తు రాజకీయనాయకుడిగా ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ లో కొనసాగిన ఉండవల్లిని ఆయన రాజకీయ సలహాదారుగా పెట్టుకుంటే జనసేనకు చాలా మంచి జరగొచ్చు. ప్రత్యర్థుల్ని దెబ్బ తీయడంలో ఉండవల్లి దిట్ట. అంతే కాకుండా రాజకీయంగా పార్టీ ఏమన్నా పొరపాటు చేసిన దానిని ఎలాగైనా సమర్ధించే సత్తా ఆయనకు ఉంది. ఆ ప్రకారం ముందుకు పోతే పవన్ కళ్యాణ్ కు చాలా మంచిది.



