జనసేనకు చెందిన 21 లక్షల ఓట్లు గల్లంతయ్యాయా?

Jana Sena Votes manipulatedజనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ మీద విమర్శల జడి వాన కురిపిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో 21 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని, అవన్నీ యువకులవే అని, జనసేనకు భయపడి అధికార పార్టీ వాటిని మాయం చేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. 21 లక్షల ఓట్లు అది కూడా అన్ని జనసేనవే అనడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే.

[m9ad]

ADVERTISEMENT

2009 ఎన్నికలలో అప్పటి ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యంకు పోలైన మొత్తం ఓట్లు దాదాపుగా 18 లక్షలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా 21 లక్షల తమ ఓట్లు గల్లంతయ్యాయి అంటున్నారు. 21 లక్షల ఓటర్లు జనసేనకు ఉంటారా అనేది ఒక ప్రశ్న అయితే… వారిని అందరిని ఏరి పట్టుకుని వారి ఓట్లు తీయించడం తేలికైన పనా అనేది ఇంకొక ప్రశ్న.

అయితే ఈ విమర్శ కేవలం జనసేనను సమర్థిస్తున్న యువత నిర్లక్ష్యంగా ఉండకుండా తమ ఓట్లు రిజిస్టర్ చేసుకోవాలని, ఇప్పటికే ఓటు ఉన్న వారిని అలెర్ట్ చేసి వారిని మరొక్కసారి చెక్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అలా చెప్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పార్టీ నేత ఆఫ్ ది రికార్డు అంటున్నారు

ADVERTISEMENT
Latest Stories