పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న చెన్నై వెళ్లిన సంగతి యావత్ ప్రపంచానికి ఎరుక. అయితే పవన్ అప్పట్లో చాలా సార్లు ఒక సినిమా హీరోగా చెన్నై వచ్చినప్పటికీ, ఇప్పుడు మాత్రం ఒక రాజకీయ పార్టీ అధినేత గా, జనసేన పార్టీ అధ్యక్షుడుగా అక్కడకు వచ్చాడు పవన్.
[m9ad]
అయితే ఈ యాత్రలో భాగంగా మాట్లాడిన పవన్ అంబెడ్కర్ కలలు కన్నారు అని, మన దేశానికి రెండో రాజధానిగా మన దక్షిణ భారత దేశంలో ఒక ప్రాంతం ఉండాలి అని, ఎంతకాలం ఆ బీహార్, గుజరాతీలు పాలనలో మనం ఉంటాం అని, మన రాజధాని మనమే సాధించుకుందాం, మనల్ని మనమే పాలించుకుందాం…దానికి జనసేన ఎప్పుడూ అండగా ఉంటుంది అంటూ పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ అస్సలు అర్ధం కానీ విషయం ఏంటి అంటే…
అసలు పవన్ అక్కడకు వెళ్లిన పని ఏంటి ? ఆయన మాట్లాడిన బాష ఏంటి? రెండో రాజధాని కోసం పోరాటమా? పైగా వాళ్లెవరో అధికారంలో మనం ఉండడం ఏంటి దక్షిణ భారతదేశం అంతా ఏకం అవ్వాలి అంటున్నారు, మరి అదే మీ ఆలోచన అయితే దేశంలో ప్రత్యేక కూటమిని తెరపైకి తీసుకు వస్తున్నా చంద్రబాబుకి మద్దతు ఇస్తే సరిపోతుందేమో? పైగా అక్కడ తెలుగు విద్యార్థులు తమ మాతృబాష అయిన తెలుగును చదువుకోలేకపోతున్నారు అంటున్నాయి తెలుగు యువ సంఘాలు, ఆ విషయంపై మాట్లాడడం మానేసి, ఈ ఉద్యమాలు, రెండో రాజధాని, మన అధికారం మనదే అంటూ ఈ ‘ఎర్రసైన్యం’ సినిమాలో పాటలు పాడటం ఏంటో పవన్ కళ్యాణ్ గారు.
అయినా మనలో మన మాట పవన్ మీరు అక్కడ అంత భారీ సభ పెట్టారు, కొంపతీసి మన జనసేన తమిళ నాట కూడా పోటీ చేస్తుందా ఏంటి?



