టిడిపి, జనసేనల సందేశం: లౌడ్ అండ్ క్లియర్

JanaSena TDP Voice Loud And Clear

టిడిపి, జనసేనలు నిన్న తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, రెండు పార్టీల నేతలు రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా, బలమైన సందేశమే ఇచ్చారు. ముఖ్యంగా తమ పొత్తుని చూసి కడుపు మంటతో రగిలిపోతున్న వైసీపి నేతలకు, వారి అధినేత జగన్మోహన్‌ రెడ్డికి, పవన్‌ కళ్యాణ్‌ శ్రేయోభిలాషుల ముసుగులో పొత్తుని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నవారికి పవన్‌ కళ్యాణ్‌ చాలా గట్టిగా చెప్పవలసినవి నాలుగు ముక్కలు చెప్పారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడి రాజకీయ, పరిపాలన అనుభవం, బలమైన టిడిపి క్యాడర్ మద్దతు లేకుండా జనసేన ఒంటరిగా బరిలో దిగి ఏమీ సాధించలేదని పవన్‌ కళ్యాణ్‌‌ కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పడం బహుశః పవన్ శ్రేయోభిలాషులు జీర్ణించుకోవడం చాలా కష్టమే.

జెండా సభలో టిడిపి, చంద్రబాబు నాయుడు గురించి పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన ఈ మాటలను వైసీపి ఎలా వక్రీకరించి చెప్పబోతోందో ఊహించుకోవచ్చు.

రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం కూడా బహుశః అదే కోణంలో చూడవచ్చు. కానీ పవన్‌ కళ్యాణ్‌ మాటలలో వైసీపిని ఓడించి టిడిపితో కలిసి అధికారంలోకి రావాలనే పట్టుదలని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు పట్టువిడుపులు చాలా అవసరమనే విషయాన్ని గుర్తిస్తే ఇక జనసేనకు తిరుగు ఉండదు.

జెండా సభలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన ఆ మాటలతో టిడిపి నేతలు, కార్యకర్తలు, రాష్ట్రంలో టిడిపిని అభిమానించే ప్రజల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారని, నేటికీ జనసేన విషయంలో ఊగిసలాడుతున్న రాష్ట్రంలో కొన్ని వర్గాలపై ఈ ప్రసంగం చాలా ప్రభావం చూపి జనసేనకు మేలు చేయబోతోందనే విషయం జనసైనికులు గ్రహిస్తే వైసీపి వలలో పడరు.

అదేవిదంగా చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు కూడా ఈ జెండా సభలో పవన్‌ కళ్యాణ్‌, జనసేనల త్యాగాల గురించి మాట్లాడి, ఆయన పట్ల గౌరవం ప్రకటించారు. టిడిపి, జనసేనల మద్య చాలా బలమైన బంధం ఉందని, తమ కూటమి విచ్ఛిన్నం అయిపోతుందని గుంట దగ్గర నక్కల కాసుకు కూర్చోన్నవారి ఆశలు ఫలించవని తేల్చి చెప్పేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేసి వైసీపిని ఓడించడం, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని పూర్తి నమ్మకంతో చెప్పారు.

టిడిపి, జనసేనల బంధం చాలా బలహీనంగా ఉందని భావిస్తున్నవారందరికీ నిన్న జరిగిన ఈ జెండా సభ పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. టిడిపి, జనసేన రెండు పార్టీల నేతలు కూడా ఈ జెండా సభని చాలా తెలివిగా, సమర్ధంగా ఉపయోగించుకొని ప్రత్యర్ధులందరికీ బలమైన సందేశం ఇచ్చాయని చెప్పవచ్చు. కనుక రెండు పార్టీలు కలిసి ఇక నుంచి మరిన్ని జెండా సభలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచింపజేసి మార్పు సాధించవచ్చు.

మాయాబజార్ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో ఘటోత్కచుడు కౌరవుల హాహాకారాలను వింటూ ‘ఆహా… ఎంత కర్ణాపేయంగా ఉన్నాయో కదా?’ అంటూ ఆనందించిన్నట్లే, టిడిపి, జనసేనల జెండా సభ ఎంత విజయవంతం అయ్యిందో నేటి నుంచి వైసీపి నేతల కడుపు మంట, వారి ఆక్రోశాలతో అందరూ తెలుసుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories