ఇండియా వ్యాప్తంగా 2016వ సంవత్సరంలో ఏ అంశం గురించి నెటిజన్లు ఎక్కువగా వెతికారు? అంటే ‘ఫ్రీడం 251’ గురించి అని ‘గూగుల్’ సమాధానం ఇచ్చింది. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో 17 రాష్ట్రాలు ఎక్కువగా ఈ ‘ఫ్రీడం 251’ గురించే వెతికినట్లుగా ‘గూగుల్’ స్పష్టం చేసింది. మరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దేనిని గురించి వెతికారు? అంటే ఆంధ్రప్రదేశ్ జనాలేమో ‘జనతా గ్యారేజ్,’ గురించి తెలంగాణా వారేమో ‘డౌన్ లోడ్’ గురించి వెతికినట్లుగా నివేదిక ఇచ్చింది.
‘టెంపర్, నాన్నకు ప్రేమతో’ వంటి విలక్షణమైన సినిమాలలో నటించి అన్ని వర్గాల నుండి క్రేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంభినేషన్ లో ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదలైన ‘జనతా గ్యారేజ్’ టాలీవుడ్ టాప్ 3 సినిమాగా నిలిచింది. దీంతో ఈ సినిమాకున్న క్రేజ్ రీత్యా ‘యూ ట్యూబ్’లో అత్యధికంగా ఏపీ జనాలు ‘జనతా గ్యారేజ్’ గురించి వెతికినట్లుగా ‘గూగుల్’ తెలిపింది. ఇప్పటికే టాలీవుడ్ నాట అత్యధికంగా వెతికిన హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ‘బుడ్డోడు’ హవాకు టైం వచ్చిందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.



