ఇంతకీ ‘గ్యారేజ్’ను ఎక్కడ పెట్టారు? టాప్ 2 ఆర్ 3?

janatha-garage-50-days-in-39-centersపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు వంటి ఫాంలో ఉన్న హీరోలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన తర్వాత బరిలోకి దిగిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” ఫలితం ఏమవుతుందా? అన్న ఆసక్తి అన్ని వర్గాలలో నెలకొంది. తన రేంజ్ కు తగ్గ హిట్ అందుకుని, దాదాపుగా ఒక దశాబ్దం పైనే గడిచింది. అయితే గత రెండు సినిమాలతో గాడిలో పడడంతో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ… అన్న రీతిలో విడుదలైన ‘జనతా గ్యారేజ్’ తొలి రోజున మిశ్రమ స్పందన లభించడంతో… మళ్ళీ నిరాశ తప్పదని భావించిన ట్రేడ్ వర్గాలకు ప్రేక్షకులు ఊహించని తీర్పును అందించారు.

యంగ్ టైగర్ కెరీర్ లోనే కాదు, ఏకంగా టాలీవుడ్ టాప్ 3లో చోటు లభించేలా చేసారు. టాప్ 5 స్థానంలోకి ప్రవేశించిన దగ్గరన్ నుండి చిత్ర నిర్మాణ సంస్థే అధికారిక పోస్టర్లు విడుదల చేయడంతో… ‘జనగా గ్యారేజ్’ కలెక్షన్స్ ను పరోక్షంగా తెలిపింది. అలాగే ‘జనతా గ్యారేజ్’ ఆల్ టైం జాబితాలో టాప్ 3లోకి ప్రవేశించిందని కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ధృవీకరించింది. ఇదే ఊపులో ‘శ్రీమంతుడు’ రికార్డులను కూడా కొల్లగొట్టి టాప్ 2ను కైవసం చేసుకుంటుందని బుడ్డోడు అభిమానులు భావించారు. కానీ, ఆ తర్వాత చిన్న సినిమాలు ఊపందుకోవడం, గ్యారేజ్ కు వచ్చే వారే కరువవ్వడంతో… చిత్ర నిర్మాణ సంస్థ నుండి టాప్ 3యే చివరి పోస్టర్ అయ్యింది.

ADVERTISEMENT

దీంతో “జనతా గ్యారేజ్” సినిమా 2వ స్థానానికి చేరుకోలేకపోయిందని, మైత్రీ మూవీస్ చెప్పకనే చెప్పింది. గత కొన్నేళ్ళుగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను పరిశీలించిన వారికి, టాప్ 3 అందుకోవడమే ఒక రకంగా షాకింగ్ లాంటిది. తన కంటే వెనుక స్టార్ డం అందుకున్న అల్లు అర్జున్ లాంటి హీరోలే 50 కోట్ల క్లబ్ లో అవలీలగా చేరితే, ‘నాన్నకు ప్రేమతో’ ముందు వరకు 50 కోట్ల క్లబ్ లో చేరడానికి జూనియర్ పడ్డ ప్రయాసలు అన్ని ఇన్ని కావు. అయితే ‘జనతా గ్యారేజ్’తో ఏకంగా 50 కాదు, 80 కోట్ల క్లబ్ ను అందుకున్నాడని ట్రేడ్ వర్గాల టాక్. ఊహించని విజయం సొంతమైంది కాబట్టే తన తదుపరి సినిమా ఆ రేంజ్ కు తగ్గకూడదని, ఇప్పటివరకు మరో సినిమానే అంగీకరించకుండా, కధలు వింటున్నారు ‘యంగ్ టైగర్.’

ADVERTISEMENT
Latest Stories