నటీనటులకు ఆ సినిమా ఓ పాఠం!

Jaya Prakash Reddy about Maya  Bazar Movieనాంప‌ల్లి తెలుగు యూనివ‌ర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఆదివారం “మాయాబ‌జార్” సినిమా ష‌ష్టి పూర్తి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ‘మాయాబజార్’ సినిమా న‌టుల‌కు నిలువుట‌ద్దం లాంటిద‌ని ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ముఖ న‌టుడు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి చిత్రాన్ని అభిప్రాయపడ్డారు. ఆ సినిమాలో సావిత్ర న‌ట‌న అద్భుత‌మ‌ని, ఆమె శ‌శిరేఖ‌గా న‌టించ‌డం గొప్ప విష‌యం కాదు కానీ, ఘ‌టోత్క‌చునిగా న‌టించ‌డం మాత్రం చాలా గొప్ప విష‌య‌మ‌ని, ఆ సినిమాలో ప్ర‌తీ పాత్ర ఓ అద్భుత‌మని కొనియాడారు.

‘మాయాబజార్’లో ఏ స‌న్నివేశం చూసినా న‌ట‌న స‌హ‌జంగా క‌నిపిస్తుంద‌ని, అయితే ప్ర‌స్తుతం అటువంటి న‌‌ట‌న‌కు అవ‌కాశం లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం షూటింగ్‌ కు వెళ్లాక తాను ఎలాంటి దుస్తులు వేసుకోవాలో అడిగి మ‌రీ ధ‌రించాల్సిన దుస్థితి ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌చ‌యిత వెన్నెల‌కంటి, సంగీత ద‌ర్శ‌కుడు మాధ‌వ‌పెద్ది సురేష్‌, చాయాగ్రాహ‌కుడు ఎస్‌.గోపాల్‌రెడ్డి, నృత్య కళాకారిణి శోభానాయుడు, న‌టుడు త‌ణికెళ్ల భ‌ర‌ణి, సీనియర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాసరావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories