చంద్రబాబుకి లీగల్ నోటీసు ఇవ్వనున్న జేడీ లక్ష్మీనారాయణ

JD -Lakshmi-Narayanaఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లీగల్ నోటీసు ఇవ్వబోతున్నారా? చంద్రబాబు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన విజయనగరం టూర్ లో స్పందిచారు. దీనిపై ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై న్యాయనిపుణులతో మాట్లాడుతున్నానని అన్నారు.

ADVERTISEMENT

లక్ష్మీనారాయణ కూడా బిజెపి వారు చెప్పినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఒక పబ్లిక్ మీటింగులో అనడాన్ని తోసిపుచ్చుతూ తాను ఎవరితో టచ్ లో లేనని అన్నారు. కళాశాల విద్యార్ధులతో మాత్రమే టచ్ లో ఉన్నానని ఆయన అన్నారు.అలాగే ఆపరేషన్ గరుడ గురించి తెలియదని, అబ్దుల్ కలాం చెప్పిన గరుడ పక్షి దృక్పదం గురించే తెలుసునని లక్ష్మీనారాయణ చెప్పారు.

ఆరు నెలలు క్షేత్రస్థాయిలో పర్యటించిన తరువాతే తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అయితే ఇటీవలే ఆయన ఆరెస్సెస్ కు చెందిన ఒక కార్యక్రమానికి హాజరు కావడంతో ఆయన బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన మాత్రం ఇప్పటిదాకా ధ్రువీకరించలేదు.

ADVERTISEMENT
Latest Stories