ఒకప్పుడు పడకగదికే పరిమితమైన భార్యభర్తల శృంగారం ఇప్పుడు క్రమంగా బహిరంగ ప్రదర్శనగా మారుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఓ కొత్త జంట రైలు బోగీలో శోభనం చేసుకోవాలనుకోవడమే.
మహారాష్ట్రలో బల్లార్ష నుండి రాజధాని ముంబై వెళ్ళే నందిగామ ఎక్స్‌ప్రెస్‌లో ఓ కొత్తజంట ఫస్ట్ క్లాస్ ఏసీ భోగిలోని ఓ కుపే బుక్ చేసుకున్నారు. అదేమీ తప్పు కాదు కానీ దానిలోనే శోభనం చేసుకోవాలని ముచ్చట పడ్డారు. తమకు కేటాయించిన కూపేలో శోభనం గదిలా పూలతో చక్కగా డెకరేషన్ చేయించుకున్నారు. ఆ వీడియోని వారే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారో సాటి ప్రయాణికులు పోస్ట్ చేశారో తెలీదు కానీ అది వైరల్ అయ్యింది.
అది చూసిన వారు ఏంటి? రైల్వేశాఖ ఇలాంటి సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చిందా? అయితే ఇటువంటి ఏర్పాట్లకి ఎవరిని సంప్రదించాలి? అదనంగా ఎంత ఖర్చవుతుంది? అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఈ విషయం రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆ కొత్త జంటకు ఈ వెసులుబాటు కల్పించిన టీటీఈని సస్పెండ్ చేశారు.
రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాము కానీ రైళ్ళలో ఇలాంటి ఏర్పాట్లు చేయడం లేదని స్పష్టం చేశారు. రైళ్ళలో సాటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే ఎటువంటి చర్యలను అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఇంతకీ ఆ కొత్త జంట ముచ్చట తీరిందో లేదో కానీ మద్యలో టీటీఈ సస్పెండ్ అయ్యారు పాపం!
Honeymoon coach on Indian Railways. Ticket checker suspended.
South Central Zone
A couple travelling in Train No. 11002 Nandigram express on 6/7/26 had privately engaged a decorator online to decorate their 1st AC coupe.
The decorator’s entry into the coach was… pic.twitter.com/1ati4A13G4
— Rajendra B. Aklekar (@rajtoday) July 8, 2026




