జనసేనపై క్లారిటీ ఇవ్వని జేడీ లక్ష్మినారాయణ?

Pawan Kalyan - JD Lakshmi Narayanaఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టరు జేడీ లక్ష్మినారాయణ రాజకీయాల్లోకి వస్తారని గట్టిగా ప్రచారం జరుగుతుంది. జనసేన లేక బీజేపీలో ఆయన జాయిన్ కాబోతున్నారనే ప్రచారం ఉంది. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించి లక్ష్మినారాయణను పార్టీలోకి ఆహ్వానించారు.

ADVERTISEMENT

ఈరోజు ఆయన తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాను మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగులో పెట్టిందని, అది ఆమోదం పొందాక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెప్పారు. జనసేనలో జాయిన్ అవ్వబోతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు.

“అవన్నీ మీరు రాసుకున్నవి అనుకున్నవే కదా? నేను ఎక్కడా చెప్పలేదు కదా! రోజూ ఆ పార్టీ ఈ పార్టీ అంటూ మీరే వార్తలు వేస్తున్నారు. నా అప్లికేషన్ ఆమోదం అవ్వనివ్వండి అన్ని విషయాల గురించి నేనే వివరంగా చెప్తా,” అని ఆయన చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికి సస్పెన్స్ లోనే పెట్టారు ఆయన అని అనుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories