సహాయ చర్యలు భేష్… జేడీ లక్ష్మీనారాయణ కితాబు

JD Lakshmi Narayana praises chandrababu naiduసిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. రెండు రోజులుగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన తుపాను నేపథ్యంలో సీఎం, ప్రభుత్వం అందిస్తున్న సహాయ చర్యలను అభినందించారు.

ADVERTISEMENT

[m9ad]

పర్యటనలో తన దృష్టికి వచ్చిన అంశాలను.. పరిష్కారాలను ఒక లేఖ రూపంలో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుతోపాటు వైద్య పరీక్షలు అందించడంపై శ్రద్ధ పెట్టాలని ఆయన కోరారు. ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి కంటే ముందు లక్ష్మీనారాయణ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం విశేషం.

తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో రూ.2,500 కోట్ల మేర నష్టం ఏర్పడింది. తక్షణ సాయంగా రూ.1,200 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి లేఖ రాసారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పటిదాకా కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ గత వారం రోజులుగా అక్కడే మకాం వేసి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories