పవన్ కళ్యాణ్ ను మెచ్చుకున్న జేడీ లక్ష్మీనారాయణ

JD Lakshmi Narayana praises Pawan Kalyan సమస్యలపై అవగాహన పెంచుకోవడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను చుడుతున్న మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటిదాకా ఐదు జిల్లాలు తిరిగారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తతు కూడా తీసుకున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఉద్దానంకు కూడా వెళ్ళొచ్చారు ఆయన. అక్కడి బాధితుల కష్టాలకు చలించి పోయారు.

ADVERTISEMENT

దీనిగురించి మాట్లాడుతూ “సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీస్కుని వెళ్లడమే కాకా, సమస్య పరిష్కారానికి విదేశాల నుండి డాక్టర్లను తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ అభినందనీయుడు,” అని కొనియాడారు ఆయన. గతంలో ఆయన జనసేనలో జాయిన్ కాబోతున్నారని పుకార్లు షికార్లు చేసాయి.

పవన్ కళ్యాణ్ కూడా ఆయన పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తా అని చెప్పారు. అయితే జనసేనలో చేరబోవడం లేదని ఆయన దాదాపుగా ఖరారు చేశారు. సొంతంగా పార్టీ పెట్టడమో ఏదైనా ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజా సేవ చేయడమా అనేవి తన ముందు ఉన్న రెండు ఆప్షన్లు అని అయన తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories