jd-lakshmi-narayana

వాసగిరి వెంకట లక్ష్మి నారాయణ అలియాస్ జేడీ లక్ష్మి నారాయణ సీబీఐ సంస్థలో పని చేస్తూ కూడా సత్యం స్కాం, ఓబుళాపురం మైనింగ్, ఎమ్మార్, జగన్ అక్రమాస్తుల కేసు విచారంలో తన మార్క్ చూపించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read – పవన్ కోసం దర్శక నిర్మాతల ఎదురుచూపులు

అయితే 2018 మహారాష్ట్రలో తానూ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి అనూహ్యంగా వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి, తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసారు జేడీ. తనకు రాజకీయాల మీద ఆసక్తి ఉందంటూ ప్రకటించి ముందుగా ప్రజల సమస్యల మీద అవగాహన తెచ్చుకుని ఆ తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇస్తానంటూ ప్రకటించి ఏపీ రాజకీయాలలోకి ప్రవేశించారు.

అయితే జేడీ పొలిటికల్ ఎంట్రీ తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది వైసీపీ. ఇక 2019 ఏపీలో జరగబోయే రాజకీయ పోరులో తానూ కూడా ఒక ఆయుధం అవ్వాలని భావించిన జేడీ జనసేన పార్టీ లో చేరి ఆ పార్టీ తరుపున విశాఖ ఎంపీ గా బరిలోకి దిగి ఓటమిని ఎదుర్కొన్నారు.

Also Read – తెలంగాణలో కూడా సేమ్ సేమ్!

పోటీ చేసిన మొదటిసారే దాదాపు రెండు లక్షల 80వేల కు పైబడి ఓట్లు, సుమారు 23.3% ఓట్ పర్శంటేజ్ దక్కించుకున్నారు జేడీ. తనతో పాటుగా తానూ పోటి చేసిన జనసేన పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓటమి పాలవ్వడంతో పవన్ తిరిగి మేకప్ వేసుకోవడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేన కు రాజీనామా చేసి బయటకు వెళ్లారు.

ఐదేళ్ల వైసీపీ పాలన మీద రాజకీయ విశ్లేషణలు చేస్తూ కాలం గడిపిన జేడీ తిరిగి 2023 డిసెంబర్ 22న ‘జై భారత్ నేషనల్ పార్టీ’ ని స్థాపించారు. అవినీతి, భానిసత్వం నుండి ప్రజలకు విముక్తి అనే నినాదంతో మొదలైన ఈ పార్టీ అధికారంలోకి వస్తే, మా పార్టీ అప్పులు చేయదు, తప్పులు చేయదు అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు.

Also Read – విద్యార్థుల ఆత్మహత్యలు…పాపం ఎవరిదీ.?

అయితే 2024 కూటమి సునామీకి 151 సీట్లతో కొండెక్కికూర్చున్న వైసీపీ కూడా 11తో పాతాళానికి పడింది. దీనితో జై భారత్ నేషనల్ పార్టీ జాడే ఎక్కడ కనిపించలేదు. తన పార్టీ తరుపున నార్త్ విశాఖ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా పొందలేకపోయారు.

రాజకీయాలలో గెలుపు ఓటములు సర్వ సహజం. కానీ ఉనికిని కోల్పోకూడదు. గత ఎన్నికలలో జనసేన కూడా రాజోలు ఒక్కటి మినహాయిస్తే పోటీ చేసిన అన్ని స్థానాలలో ఓటమిని ఎదుర్కొంది. చివరికి పవన్ ను కూడా పోటీ చేసిన రెండు చోట్ల ప్రజలు తిరస్కరించారు.

అయినా పవన్ తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపలేదు. అలాగే రాజకీయాలలో తన ఉనికిని, తన పార్టీ ప్రస్తావాన్ని ఎక్కడ కోల్పోకుండా రాజకీయాలు చేస్తూనే వచ్చారు. అయితే జేడీ లక్ష్మి నారాయణ కూడా ఓటమి ఎదురయ్యిందనో, గెలుపు అందుకోలేకపోయాననో అనుకోకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల మీద ప్రభుత్వం తో పోరాడుతూ ఉంటే ఎదో ఒకరోజు ఏపీ రాజకీయాలలో కూడా జేడీ హాట్ టాపిక్ కావచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వరదలు సృష్టించిన భీభత్సానికి ప్రజలు సర్వస్వము కోల్పోయి అల్లాడుతుంటే జై నేషనల్ పార్టీ తరుపున జేడీ లక్ష్మి నారాయణ ఎక్కడ కనిపించలేదు. అలాగే తన వంతు సాయం కింద కష్టాలలో ఉన్న ప్రజలకు మద్దతుగా మేమున్నాం అనే భరోసా ఇవ్వడంలో కానీ జేడీ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు.

రాష్ట్రంలో ఇంతటి భయానక వాతావరణం ఉన్నప్పటికీ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా జేడీ జాడ కనిపించక పోవడం ఆయన ఉనికిని ప్రశ్నిస్తుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన ప్రతిపక్షం బురద రాజకీయాలు చేస్తూ వరద బాధితులను గాలికొదిలేసింది.

ఇటువంటి కిష్ట సమయంలో ప్రజలకు గుక్కెడు మంచి నీళ్లు అందించినా, పట్టెడన్నం పెట్టినా అది వారికీ ఏంతో మేలు చేసినట్టే అవుతుంది. దీనికి ప్రభుత్వానికి చేయూతగా పలు స్వచ్ఛంద సంస్థలు, పలువురు వ్యాపార వేత్తలు, సినీ, రాజకీయ సెలబ్రేటిస్ విరాళాలతో ముందుకొస్తున్నా జేడీ మాట మాత్రం ఎక్కడ వినిపించడం లేదు.

ఎన్నికలు ముగిసి ఇప్పటికి దాదాపు 4 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఏపీ పొలిటికల్ తెర మీద జేడీ అదృశ్యమయ్యారు. దీనితో రాజకీయాల నుండి కూడా వి.వి లక్ష్మి నారాయణ అలియాస్ జేడీ లక్ష్మి నారాయణ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలలో గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటూ మళ్ళీ రాజకీయాలే చెయ్యాలి అనేది జేడీ గ్రహిస్తారా లేక సైలెంట్ అవుతారా.?