వీడియో వైరల్ : జీసస్ కళ్ళు తెరిచాడు!

Jesus Statue Opens Eyes, Jesus Statue Opens Eyes Mexico, Jesus Statue Opens Eyes Caught On Cam, Jesus Statue Opens Eyes CCTV, Jesus Statue Opens Eyes Videoవినాయకుడు పాలు తాగడం… ఆ తర్వాత ఎంతో మంది దేవుళ్ళు కళ్ళు తెరిచి చూడడం… ఇంకెంతో మంది దేవుళ్ళు ఆకారంలో ఆలయ ప్రాంగణాలలో చక్కర్లు కొట్టడం… ఇలా లెక్కకు మించే జరిగాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా… ఎవరి నమ్మకం వారిని ఆ దిశగా నడిపిస్తుంది. అయితే ఇదంతా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ లుగా హేతువాదులు కొట్టిపడేస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలోకే మరో మిస్టరీ వచ్చి చేరింది. మెక్సికోలోని ఓ చర్చిలో జీసస్ విగ్రహం కళ్ళు తెరిచి చూడడం వింతగా మారింది. సీసీ టీవీ ఫుటేజ్ లో బయటపడినట్లుగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్ళు మూసుకుని ఉన్న విగ్రహం కాస్త కొద్ది సెకన్ల పాటు కళ్ళు తెరిచి చూడడం ఈ వీడియోలో ప్రత్యేకత. అయితే ఇదంతా జీసస్ మహిమ అని కొందరు అంటుంటే… జీసస్ కళ్ళు తెరవడానికి వీడియోను బాగా ఎడిట్ చేసారంటూ కామెంట్లు చేస్తున్నారు.

ADVERTISEMENT

అది నిజమో కాదో అన్న విషయం నిజంగా ఇద్దరికే తెలియాలి ఒకరికి ఆ జీసస్ కు, రెండవది ఆ వీడియోని సోషల్ మీడియాలోకి పోస్ట్ చేసిన తొలి వ్యక్తికి. దీనిని మహిమ అని కొలిచే వారి కన్నా, ఇదొక ఫేక్ వీడియో అని కుండబద్దలు కొడుతున్న వారి సంఖ్యే సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటోంది. మరి మీరేమంటారు అబ్బాయిలు..!

ADVERTISEMENT
Latest Stories