ఈ శుక్రవారం వైసీపీకి కలిసొచ్చిందే..!

jgi-rajeev-pinneli-ramakrishna-reddy

వైసీపీ పార్టీకి ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి శుక్రవారానికి విడతీయరని అవినాభావ సంబంధం ఉన్న మాట వాస్తవం. జగన్ ప్రతిపక్షమం లో ఉన్న సమయంలో తన అక్రమాస్తుల కేసుల నేపథ్యంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉండేది. దీనితో జగన్ కు శుక్రవారం గండం మొదలయ్యింది అంటూ ప్రత్యర్థులు కౌంటర్లు వేసేవారు.

అయితే జగన్ అధికారంలోకి రాగానే శుక్రవారం తానూ కోర్ట్ కెల్లకుండా తన ప్రత్యర్థి పార్టీ నేతలను జైలుకు పంపించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అదే శుక్రవారాన్ని తన అస్త్రంగా మార్చుకుని తన మీద ఆరోపణలు చేసిన ఒక్కో టీడీపీ నేతను ఒక్కో శుక్రవారం అరెస్టు చేపించి అధికారాన్ని వ్యక్తిగత కక్ష్యలు తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నారు జగన్.

ADVERTISEMENT

వైసీపీ ప్రభుత్వ హయాంలో శుక్రవారం వస్తుంది అంటే ప్రత్యర్దులలో ఎవరికో మూడింది అన్నంతలా శుక్రవారాన్ని ప్రత్యర్థుల పాలిట గ్రహణంలా మార్చేసారు. ఈ శుక్రవారం ఖాతాలో బలైన అభ్యర్థులలో వైసీపీ రెబల్ ఎంపీ RRR ఒకరు. వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ కక్ష్య సాధింపులకు వేదికైన ఈ శుక్రవారం ఇప్పుడు అరెస్టైన వైసీపీ నేతలకు ఊరట నిచ్చింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని ఈవీఎం ల ధ్వంసం కేసులో, ఒకరి మీద హత్యాయత్నం కేసులో అరెస్టు అయినా వైనం తెలిసిందే. అలాగే అగ్రి గోల్డ్ భూ కుంభకోణం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ కూడా కటకటాల వెనక్కి వెళ్ళక తప్పలేదు.

ఇక ఈ ఇద్దరికీ ఈ శుక్రవారం న్యాయస్థానాలు బైలు మంజూరు చేయడంతో వైసీపీ నేతలకు కాస్త ఊరట దక్కిందినట్లయ్యింది. దీనితో ఈ శుక్రవారం వైసీపీ కి కాస్త కలిసొచ్చినట్టు ఉందిగా అంటూ సర్ది చెప్పుకుంటున్నారు పార్టీ శ్రేణులు. ఇక బాబు ఇంటి మీద దాడి ఘటన కేసులో జోగి రమేష్ వేసిన ముందస్తు బైలు పిటిషన్ తీర్పును హైకోర్టు వచ్చే నెల 3 కు వాయిదా వేసింది.

ADVERTISEMENT
Latest Stories