సాయికృష్ణ మీదున్న శ్రద్ద…డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీద లేదా.?

Sai Krishna Controversy: YSRCP Faces Questions Over Politics

ఒక మనిషి ప్రాణం ఖరీదు కేవలం రాజకీయమేనా అన్నటుగా మారిపోతుంది వైసీపీ రాజకీయం. సాయికృష్ణ మిస్సింగ్ వివాదం పై వైసీపీ చేస్తున్న కుల రాజకీయాలు గతంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసును జ్ఞప్తికి తెస్తుంది.

గత వైసీపీ హయాంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్ అయిన దళిత వ్యక్తి సుబ్రహ్మణ్యం ను అత్యంత దారుణంగా హత్య చేసి ఆయన శవాన్ని వారి ఇంటికే డోర్ డెలివరీ చేసారు. అయితే తానూ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసినట్టు అనంతబాబు కూడా అంగీకరించారు.

ADVERTISEMENT

అయినా కూడా నాటి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ సభలకు, సమావేశాలకు అనంతబాబు ను వెంటపెట్టుకుని తిరిగారు. నేడు సాయికృష్ణ మిస్సింగ్ ను ఒక లాకప్ డెత్ గా ప్రచారం చేస్తున్న వైసీపీ ఆ సాయికృష్ణ కులాన్ని కూడా వివాదంలోకి తెచ్చింది.

23 ఏళ్ళ వయస్సులో 21 కేసులున్న సాయికృష్ణ ను చిన్నపిల్లాడు అంటూ అతని నేరాలను తెలియని తప్పులుగా చెపుతూ సాయికృష్ణ మీద సానుభూతి వ్యక్తం చేస్తున్న జగన్ కి, తన పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దుర్మార్గానికి బలైన సుబ్రహ్మణ్యం మీద జాలికలగలేదా.?

సుబ్రహ్మణ్యం హత్య తో ఆయన కుటుంబం అనాథలా మారింది. ఒక పసిపిల్లాడికి తండ్రి లేకుండా పోయాడు, ఒక మహిళ పసుపు కుంకుమలు నేలరాలిపోయాయి, ఒక తల్లికి పుత్ర శోకం కలిగింది. మరి అటువంటి ఘటనకు చలించని జగన్ హృదయం ఇప్పుడు ఒక రౌడీ షీటర్ మిస్సింగ్ తో కదిలిందా.?

వైసీపీ కి హత్యలు చేసేవారి మీదున్న సానుభూతి హత్యకు గురిఅయిన వారి మీద ఉండదా.?ఇప్పుడు సాయికృష్ణ విషయంలో ఇంత రాజకీయం చేస్తున్న వైసీపీ సుబ్రహ్మణ్యం విషయంలో ఎందుకు మౌనం గా ఉండిపోయిందో చెప్పగలరా.? అలాగే తన అక్కను వేధిస్తున్న కారణంగా వారిని అడ్డుకోవడానికి వెళ్లిన 14 ఏళ్ళ అమర్నాథ్ ను పెట్రోల్ పోసి కాల్చేసిన ఘటన మీద వైసీపీ కి లేని స్పందన ఇప్పుడు సాయికృష్ణ వివాదం మీద ఎందుకు.?

14 ఏళ్ళ వయస్సులో ఏ తప్పు చేయని అమర్నాథ్ అగ్నికి ఆహుతయినా వైసీపీ నేతలకు వేడి తగలలేదు. అలాగే సుబ్రహ్మణ్యం అనే దళిత వ్యక్తి వైసీపీ నేత చేతిలో ప్రాణాలు కోల్పోయినా వైసీపీ నేతలకు చట్టాలు గుర్తురాలేదు. కానీ ఇప్పుడు సాయికృష్ణ విషయంలో మాత్రం వైసీపీ రాజకీయానికి కులం కనిపిస్తుంది, చట్టాలు గుర్తొస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories