మూడు అంగుళాల కత్తితో చిన్న గాయమైతే దానిని హత్యాయత్నం అంటూ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న హుంగామా అంతా ఇంతా కాదు. ప్రజలలో సింపతీ కోసమా అన్నట్టు ఆ గాయాన్ని పెద్దది చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ వారు.
[m9ad]
జగన్ ఈ రోజు పాదయాత్ర మొదలు పెట్టాల్సి ఉండగా కి గాయం పూర్తిగా నయం కాలేదని సిటీన్యూరో వైద్యులు పేర్కొన్నారు. మరో రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైఎస్ జగన్‌కు సూచించామన్నారు. రెండు రోజులకు ఒకసారి ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని, గాయం అయిన ప్రాంతంలో కండ ఇంకా పూర్తిగా కూడుకోలేదన్నారు.
పాదయాత్రలో చేతులు పైకెత్తి అభివాదం చేయడం వలన నొప్పి మరింత పెరిగే అవకాశం ఉందని, కనీసం ఒక వారం అయినా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించామన్నారు. హార్ట్ బీట్, బీపీ పరీక్షించామని.. నిలకడగానే ఉన్నాయన్నారు. వైద్యుల సూచనల మేరకు మరికొన్ని రోజులు వైఎస్ జగన్ పాదయాత్ర వాయిదా పడే అవకాశం ఉంది. అయితే సింపతీ రాకపోగా ఇది రివర్స్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు వారాలు రెస్టు తీసుకోవడానికి ఆయన కేమన్న పెద్దాపరేషన్ జరిగిందా అంటూ జోకులు పేలుస్తున్నారు.



