‘మాట’ మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయ విమర్శలు – ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం. నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన నా మనసును కలిచివేసింది. అయితే అది ప్రజా సమస్యలపై ఉండాలి గానీ, వ్యక్తిగత దూషణలపై కాదు.
ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాము, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నాము అంటే అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది.
Also Read – రజని తో రాజీ…జరిగే పనేనా.?
స్త్రీజాతిని గౌరవించడం అనేది మన సంసృతి, మన నవనాడుల్లో, మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం. మన సంప్రదాయాలను రాబోయే తరాలకు జాగ్రత్తగా అప్పచెప్పాలే గానీ, మన సంసృతిని మనమే కలిచివేసి, కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాము అంటే తప్పు. మనం చేసే చాలా పెద్ద తప్పు.
ఇలాంటి వ్యక్తిగత దూషణలకు గురయినటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడలేదు, ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశ పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒక్కటే విన్నపం. దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపండి.
Also Read – పాపం శ్యామల… ఎలా నెగ్గుకొస్తారో?
ప్రజా సమస్యల మీద పోరాడండి, రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది అక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నాను. నమస్కారం!
ఇది జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ తెలిపిన విజ్ఞప్తి. ఎంతో హుందాగా, సంయమనంతో, సూటిగా సుత్తి లేకుండా చెప్పుకొచ్చారు. మొత్తానికి నిన్న అసెంబ్లీ వేదికగా వైసీపీ చేసిన రచ్చ నందమూరి – నారా కుటుంబ సభ్యులను ఒక తాటిపైకి తీసుకువచ్చినట్లుగా కనపడుతోంది.jr ntr advised to ys jagan