ఎన్టీఆర్ ను ‘రౌండప్’ చేసిన అభిమానులు!

jr-ntr-at-rajamundry-bobby-shoot‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిందని చెప్పడానికి తాజాగా విడుదలైన ఫోర్బ్స్ జాబితానే ఉదాహరణ. అలాగే ‘గూగుల్’లోనూ అత్యధికంగా వెతికిన తెలుగు హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానంలో నిలవడంతో… ‘బుడ్డోడు’ ప్రస్తుతం మంచి ఊపులో ఉన్నాడు. త్వరలో బాబీ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్న జూనియర్ ఎన్టీఆర్, తాజాగా రాజమండ్రిలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు.

సదరు కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరుగు పయనం అయిన జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు నీరాజనాలు పలికారు. రోడ్డుకు ఇరువైపులా బైక్ లతో అభిమానులు ముందుండి ఎన్టీఆర్ ను నడుపగా, మార్గమధ్యలో ఓ బైక్ పడిపోవడంతో, వెంటనే కారులోంచి దిగిన జూనియర్ ఎన్టీఆర్, సదరు అభిమాని పరిస్థితి ఎలా ఉందో స్వయంగా తెలుసుకున్నాడు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో, అశేష అభిమానుల నడుమ జూనియర్ ఎన్టీఆర్ పయనమయ్యారు.

ADVERTISEMENT

అయితే ఈ గ్యాప్ లో అభిమానిని చూసేందుకు కారు దిగిన జూనియర్ ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ రౌండప్ చేసారు. యంగ్ టైగర్ ను అతి దగ్గర నుండి చూసేందుకు ఎగబడిన అభిమానులు, తమ దగ్గరున్న మొబైల్స్ తో, కెమెరాలతో తారక్ ను క్లిక్ మనిపించారు. అలాంటి ఫోటోలలో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అభిమానులు రౌండప్ చేసిన ఈ ఫోటోలో కళ్ళజోడు పెట్టుకుని తారక్ అదిరిపోయే రీతిలో ఉండగా, తారక్ ను చూసిన ఫ్యాన్స్ లో ఉత్సాహం ఫోటోలో స్పష్టంగా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories