అభిమానుల అంచనాల త్రాసులో దేవర గెలిచాడా

Jr Ntr Devara First Lookజూనియర్ ఎన్టీఆర్ 30కి దేవర టైటిల్ ని ప్రకటించారు. ఇది లీకు రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తే అయినప్పటికీ అఫీషియల్ గా తన లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టే ఎగసిపడే అలల మధ్య విరిగిన కొండగుట్టలపై చేతిలో బల్లెం పట్టుకుని గంభీరంగా చూస్తున్న లుక్ అభిమానులకు హైప్ ఇచ్చేలా ఉంది. నల్లని దుస్తులు అందులోనూ పంచెతో కూడిన వస్త్రధారణ ఇదేదో రెగ్యులర్ మాస్ వేషం అనుకుంటే పొరపాటే అనిపించేలా ఉంది. డెప్త్ చాలానే పెట్టారు.

ఒక డిజాస్టర్ పడినా కూడా నమ్మకంతో తారక్ ఇచ్చిన అవకాశాన్ని కొరటాల శివ ఏ స్థాయిలో వాడుకుంటాడో చెప్పేందుకు ఇక నుంచి మొదలుపెట్టే ప్రతి ప్రమోషన్ సాక్ష్యంగా నిలుస్తుంది. హైప్ పెరగాలన్నా తగ్గాలన్నా పూర్తిగా వీటి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే టైటిల్ విషయంలో చాలా గుట్టుని మైంటైన్ చేసి కేవలం రెండు రోజుల ముందు మాత్రమే బయటికి వచ్చేలా చేశారు. గెటప్ కు సంబంధించి మాత్రం ఎలాంటి క్లూస్ లేకుండా జాగ్రత్త పడిన తీరు ఇప్పుడీ దేవర ఫస్ట్ లుక్ కు సానుకూలాంశంగా మారింది.

ADVERTISEMENT

దేవర సక్సెస్ తారక్ కు సైతం చాలా కీలకం. అరవింద సమేత వీర రాఘవ వచ్చి నాలుగేళ్లు దాటేసింది. ఆర్ఆర్ఆర్ వచ్చినా అది మల్టీ స్టారర్ కాబట్టి సోలో హీరోగా యంగ్ టైగర్ ని తెరమీద చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. అందుకే సింహాద్రి లాంటి ఇరవై ఏళ్ళ పాత సినిమాకు సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్, వందల కొద్ది షోలు ప్లాన్ చేసుకుని తమ ఫ్యానిజం చూపిస్తున్నారు. ఇది ఒకందుకు మంచిదే. తన మీద ఎంత అంచనాల బరువుందో జూనియర్ తో పాటు కొరటాల శివకు అర్థమవుతుంది.

జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ క్యాస్టింగ్ ఎలాగూ ప్యాన్ ఇండియా ఫ్లేవర్ కు ఉపయోగపడుతుంది. జపాన్ లాంటి దేశాల్లో తారక్ కు వచ్చిన ఫాలోయింగ్ దృష్ట్యా మేకింగ్ కు సంబంధించి నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనిరుద్ రవిచందర్ మొదటిసారి జూనియర్ మూవీకి సంగీతం సమకూర్చడం, సముద్రం బ్యాక్ డ్రాప్ లో వయొలెంట్ మాస్ ఎంటర్ టైనర్ గా ఇది ఉండబోతోందని క్యాప్షన్స్ రూపంలో సంకేతం ఇవ్వడం ఇవన్నీ దేవరకు మంచి శకునాలే. మరి ఎలాంటి గెలుపు అందుకుంటాడో.

ADVERTISEMENT
Latest Stories