సంక్రాంతి బరిలో జూనియర్ ఎన్టీఆర్!

Jr-NTR---Who-Else-Can-Be-Most-Hard-Working-Tollywood-Hero-of-2017గతేడాది దసరా పండగకు విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం “జై లవకుశ” సినిమా పరంగా ఎలాంటి టాక్ తెచ్చుకున్నప్పటికీ, నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ను మరో మెట్టు ఎక్కించిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ తరం నటులలో మూడు విభిన్నమైన పాత్రలను పోషించిన మొదటి నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ కీర్తిప్రతిష్టతలను చాటిచెప్పిన ఈ సినిమా, ఈ సంక్రాంతి నాడు బుల్లితెరపై ప్రదర్శితం కాబోతోంది.

అవును… ఇటీవల కొత్త సినిమాలన్నీ బుల్లితెరపై వెనువెంటనే ప్రదర్శితం అవుతున్న నేపధ్యంలో… ‘జై లవకుశ’ కూడా అదే బాటను ఎంచుకుంది. అంటే ఈ సంక్రాంతి పండగకు జూనియర్ ఎన్టీఆర్ కూడా సందడి చేయనున్నాడన్న మాట. ‘బిగ్ బాస్’తో సరికొత్త టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ ‘జై లవకుశ’తో కూడా సరికొత్త రికార్డులు కొడతాడేమో చూడాలి. జనవరి 13వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు జెమిని టెలివిజన్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ‘జై లవకుశ.’

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories