ఇట్స్ అఫీషియల్ – “జనతా గ్యారేజ్” ఫస్ట్ రికార్డ్!

Janatha Garage, Janatha Garage Records, Janatha Garage Teaser Records, NTR Janatha Garage Teaser Records, Jr NTR Janatha Garage Teaser Records,  Janatha Garage movie Teaser Records,  Janatha Garage Teaser YouTube Records,అనుకున్నదంతా అయ్యింది… 34 సెకన్ల టీజర్ తో ‘జనతా గ్యారేజ్’ రికార్డులు ఓపెన్ అయ్యాయి. ఈ టీజర్ రికార్డులు కొట్టిన తీరు పరిశీలిస్తే… బొమ్మ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అనేటంతగా ప్రేక్షకుల్లో నమ్మకాన్ని కలిగించింది. సాధారణంగా యూ ట్యూబ్ రికార్డులలో పవన్, మహేష్ ల సినిమాల టీజర్లు, ట్రైలర్లే ముందుంటాయి. కానీ, జూనియర్ ఎన్టీఆర్ గత సినిమా “నాన్నకు ప్రేమతో” నుండి సోషల్ మరియు వెబ్ మీడియాలో జూనియర్ కూడా తన రికార్డులను మెరుగుపరుచుకుంటున్నారు.

ఇక, తాజా టీజర్ ‘జనతా గ్యారేజ్’ విషయానికి వస్తే… విడుదల చేసిన కేవలం ఆరు గంటల సమయం లోపునే 1 మిలియన్ క్లిక్స్ అందుకున్న తొలి టీజర్ గా రికార్డులకెక్కింది. ఓ పక్కన టీజర్ వీక్షిస్తూ పండగ చేసుకుంటున్న అభిమాన వర్గానికి ఇలాంటి రికార్డులు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా కూడా డిక్లేర్ చేయడంతో… ఫస్ట్ రికార్డును ‘జనతా గ్యారేజ్’ తన ఖాతాలో వేసుకుంది.

ADVERTISEMENT

దీంతో అభిమానులందరి చూపులు ఆడియో వేడుక వైపుకు మళ్ళాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం అద్భుతంగా ఉండడంతో, ఈ సినిమా ఆల్బమ్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే రికార్డు ధరలకు ఆడియో హక్కులు అమ్ముడయ్యాయన్న టాక్ కు తోడు, ఆల్బమ్ కూడా బాగా వచ్చిందనే మాటలు సినీ వర్గాల నుండి వ్యక్తం అవుతుండడంతో, యంగ్ టైగర్ అభిమానులు ఈ నెల 22వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories