ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసిని, బాలకృష్ణ ఈ ఉదయం నివాళులర్పించారు. మహాప్రస్థానంలోని హరికృష్ణ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం ఆవిడ కూకట్‌పల్లి వెళ్ళి తన నామినేషన్ దాఖలు చెయ్యనున్నారు. కొంత కాలంగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న హరికృష్ణ కుటుంబం నుండి ఆవిడ రాజకీయరంగేట్రం చేస్తుండటంతో జూనియర్ ఎన్టీఆర్ ఏం చెయ్యబోతున్నారు? బాలయ్య ఎలా స్పందించబోతున్నారు అనేది సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
[m9ad]
ఈ క్రమంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్టీకి సుహాసిని గారికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా అని పాత్రికేయులు అడిగారు. “ఎవరి ఇష్టం వారిది… వారి వారి షెడ్యూల్ బట్టి ప్రచారం చేస్తారు,” అని బాలయ్య ఒకింత చాకచక్యంగానే సమాధానం. గతంలో ఇటువంటి ప్రశ్నలకు బాలయ్య చెప్పిన సమాధానాలు అప్పట్లో పెను సంచలనాలు, వివాదాలు సృష్టించాయి. మరోవైపు బాలయ్య కూడా సుహాసిని నామినేషన్ కార్యక్రమానికి హాజరు అవుతున్న క్రమంలో అక్క కోసం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముందుకు వస్తారా అని చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో తరువాత వివాదాస్పదం అవ్వకుండా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముందే జాగ్రత్త పడ్డారు. అక్క కు కంగ్రాట్స్ చెబుతూ జూనియర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టారు. సమాజంలో స్త్రీలు ఉన్నత పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం మాది అంటూ ఆవిడకు గెలుపు చేకూరాలని కోరుకున్నారు. ఈ క్రమంలో తమ తాతగారు స్థాపించిన తెలుగు దేశం పార్టీ తమకు ఎంతో పవిత్రమైనదని చెప్పుకొచ్చారు. గమనించాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా టీడీపీకి ఓటు వెయ్యాలని తమ వారిని కోరలేదు.
దీనిబట్టి వారు నియోజకవర్గంలో సుహాసిని కోసం ప్రచారం చేసే పరిస్థితి ఉండకపోవచ్చని అనుకోవాలి. అలాగే రెండు వైపులా ఉన్న విబేధాలను కొంత మేర పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఇంకా చిన్నపాటి ఇబ్బంది ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కుటుంబ పరంగా ఉండే సహజమైన ఒత్తిడికైనా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ స్పందిస్తారో లేదో చూడాలి. తెలంగాణాలో తెలుగు దేశం మనుగడకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్నికలలో మహాకూటమి అధికారంలోకి వస్తేనే టీడీపీ మనుగడ సాగించే పరిస్థితి ఉంటుంది.
Wishing my sister Suhasini garu all the very best, as she takes her first step into public service pic.twitter.com/Hl2TJ4rMsd
— Jr NTR (@tarak9999) November 17, 2018



