Jr NTR Nava Bharat National Party  presidentప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోలలో ఏ అంశం మీదైనా అనర్గళంగా, అర్ధవంతంగా మాట్లాడగల హీరో ఎవరైనా ఉన్నారంటే… అది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని చెప్పవచ్చు. అంతటి వాక్చాతుర్యం గల జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఏమిటో, చిరంజీవి ‘ప్రజారాజ్యం’ స్థాపించిన టైంలో అందరికీ తెలిసివచ్చింది. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార బాధ్యతలు నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాలను చూసి, ఉద్దండ రాజకీయ పండితులు కూడా ముక్కు మీద వేలేసుకున్నారు.

అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసినవే. ఈ క్రమంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్, ఇక తన దృష్టంతా కేవలం సినిమాల పైనే ఉంటుందని, వివిధ సందర్భాలలో స్పష్టత ఇచ్చారు. దీంతో ఇటీవల కాలంలో రాజకీయాలలో జూనియర్ ఎన్టీఆర్ పేరు పెద్దగా వినపడం మంసింది. కానీ, తాజాగా ఓ సంచలన సంగతి బయటకు వచ్చింది. ‘నవ భారత్ నేషనల్ పార్టీ’ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ ఓ పార్టీని రిజిస్టర్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఓ లెటర్ హెడ్ హల్చల్ చేస్తోంది.

అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనేది ప్రశ్నార్ధకమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ లెటర్ హెడ్ ను మార్ఫింగ్ చేసి, ఈ ‘నవభారత్ నేషనల్ పార్టీ’గా రూపొందించినట్లుగా ఈ లెటర్ హెడ్ కనపడుతోంది. ఓ పక్కన జూనియర్ ఎన్టీఆర్ రామోజీ ఫిలిం సిటీ “జై లవకుశ” సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటుండగా, మరో వైపు ఏప్రిల్ 11తేదీతో పార్టీ రిజిస్టర్ అయినట్లుగా దీనిని రూపొందించారు. అయితే ఇది కుట్రపూరితమైనదా? లేక సంచలన నిర్ణయం దిశగా జూనియర్ అడుగులు వేసారా? అన్నది అభిమానులకు స్పష్టత కావాల్సి ఉంది.