ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్స్ అప్పుడేనా?

Jr- NTR - Ram Charan - Rajamouli - RRRటాలీవుడ్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రం జులై 30, 2020న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

సినిమాలో వీరిద్దరి లుక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు జక్కన్న. ఈ హీరోలను ఆ ఉద్యమ వీరుల పాత్రలలో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే రోజున వీరి లుక్స్ విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ కనీసం కొమరం భీం జయంతికి కూడా ఎన్టీఆర్ లుక్ విడుదల చేయలేదు.

ADVERTISEMENT

తాజాగా వచ్చే ఏడాది చరణ్ పుట్టిన రోజు కానుకగా అల్లూరి పాత్రను, ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు కొమరం భీం పాత్రను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. చరణ్ పుట్టినరోజు మార్చ్ 27కాగా, ఎన్టీఆర్ ది మే 20, ఎన్టీఆర్ కంటే కూడా చరణ్ లుక్ నే మొదట విడుదల చేసే అవకాశం ఉంది.

మరోవైపు రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు చిత్రబృందం.

ADVERTISEMENT
Latest Stories