‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ సినిమాలతో మళ్ళీ టాలీవుడ్ టాప్ చైర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రేసులోకొచ్చారన్న విషయం తెలిసిందే. తాజాగా సెట్స్ పైన ఉన్న “జై లవకుశ” సినిమాపై కూడా భారీ క్రేజ్ ఉంది. టాప్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కాకపోయినా, ఈ సినిమాపై అత్యంత ఆసక్తి నెలకొందంటే, అది జూనియర్ ఎన్టీఆర్ వల్లనే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అటు సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, స్మాల్ స్క్రీన్ పైన కూడా తర్వలో ఎంట్రీ ఇవ్వబోతున్న జూనియర్ ఎన్టీఆర్, సోషల్ మీడియాలో అభిమానులను మరింత దగ్గర చేసుకుంటున్నారన్న విషయం ట్విట్టర్ చెప్పకనే చెప్తోంది. అవును… ట్విట్టర్ లో తన అభిమానగ ణాన్ని ‘బుడ్డోడు’ పెంచుకుంటూ, తాజాగా 1 మిలియన్ మార్క్ ను అందుకున్నాడు. ఈ ఫీట్ సొంతం చేసుకున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ నాలుగవ వ్యక్తి.
అగ్ర స్థానంలో మహేష్ బాబు 3.3 మిలియన్స్ లో ఉండగా, పవన్ కళ్యాణ్ 1.9, అల్లు అర్జున్ 1.4 మిలియన్స్ తో ఉన్నారు. తాజాగా జూనియర్ 1 మిలియన్ క్లబ్ లోకి చేరడంతో, దగ్గరలో ఉన్న బన్నీని అధిగమించడం పెద్ద విషయమేమి కాకపోవచ్చు. త్వరలో ఎలాగూ ‘జై లవకుశ’ ప్రమోషన్ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి, మరో మిలియన్ మార్క్ ను అతి తక్కువ సమయంలోనే సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.



