సిల్వర్ స్క్రీన్ పై వరుస విజయాలతో దూసుకుపోతున్న ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ దృష్టి ప్రస్తుతం వెబ్ సిరీస్‌పై కూడా పడిందట. ఇప్పటికే బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ ముందుముందు డిజిటల్ యుగందే హవా అని గమనించి, వెబ్ సిరీస్ రంగంలోనూ రాణించాలని భావిస్తున్నారట. ఇప్పటికే తెలుగులో నిహారికా కొణిదెల, రానా దగ్గుబాటి, నవదీప్, జగపతిబాబు వంటి వారు వెబ్ రంగంలోకి అడుగుపెట్టారు.
[m9ad]
అలాగే మరో పక్కన హిందీలోనూ మాధవన్, సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి అగ్ర కథానాయకులు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ రంగంలో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఆ సినిమా ఎలాగూ రెండేళ్ళు పడుతుంది కాబట్టి, ఇలా అయితే ప్రేక్షకులకు కూడా టచ్ లో ఉన్నవారవుతారు.



