తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి కేసీఆర్, బిఆర్ఎస్ నేతలే కాదు… ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా బాగా షాక్ అయిన్నట్లే ఉన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు కూడా కాకముందే 11 నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మార్చేశారు. అంటే ఆ స్థానాలలో వేరేవారిని ఎమ్మెల్యేలుగా నిలబెట్టబోతున్నారన్న మాట!
రాష్ట్రంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కనుక టీవీ 9 మంగళవారం ఓ చర్చా కార్యక్రమం నిర్వహించింది. దానిలో సీనియర్ వైసీపి నేత జూపూడి ప్రభాకర్ పాల్గొన్నారు.
టీవీ 9 తరపున రజనీకాంత్ జూపూడికి ఓ సూటి ప్రశ్న వేశారు. “మీ ప్రభుత్వం నవరత్నాలు అమలుచేస్తోంది. మీ ముఖ్యమంత్రి నిత్యం బటన్ నొక్కుతూ లబ్ధిదారుల ఖాతాలలో రెండున్నర లక్షల కోట్లు వేశామని కనుక రాష్ట్రంలో ప్రజలందరూ మనవైపే ఉన్నారని చెప్పుకొంటారు. నేను బటన్ నొక్కుతుంటే మీరందరూ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుకొంటే చాలు. మనకే 175 సీట్లు వస్తాయని చెప్పుకొంటున్నారు కదా?ఇన్ని చేసినా ఇప్పుడు హటాత్తుగా నియోజకవర్గం ఇన్‌చార్జిలను లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాల్సిన అవసరం ఏమిటి?” అని సూటిగా ప్రశ్నించారు.
సమాధానం చెప్పడానికి జూపూడి తడబడ్డారు. “మీరు నా నుంచి ఏదైనా కొత్త విషయం బయటకు లాగాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు. సిఎం విధానపరమైన నిర్ణయాలను తీసుకొన్నప్పుడు వాటిని అట్టడుగు స్థాయి వరకు తీసుకువెళ్ళడానికి క్షేత్రస్థాయిలో పనిచేసేవారు అవసరం ఉంటుంది కదా..” అంటూ ఏదో చెప్పబోయారు.
అప్పుడు రజనీకాంత్ మళ్ళీ కలుగజేసుకొని “మీ ప్రభుత్వం గ్రామస్థాయి వరకు సచివాలయాలు, వాలంటీర్లను ఏర్పాటు చేసుకొంది. వారందరూ పనిచేస్తుండగా ఇప్పుడు ఎమ్మెల్యేలను బాధ్యులను చేయడం దేనికి?అంటే ఆ వ్యవస్థలు కూడా ఫెయిల్ అయ్యాయనుకోవాలా లేక మీ ఎమ్మెల్యేలే ఫెయిల్ అయ్యాయనుకోవాలా?” అని సూటిగా ప్రశ్నించచారు. దీంతో జూపూడి మళ్ళీ తడబడ్డారు.
“యస్! మాకు అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వేలాదిమంది అధికారులు, లక్షలాది ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ నియోజకవర్గం స్థాయిలో ఎమ్మెల్యేదే పూర్తి బాధ్యత కదా? ఒకవేళ ఆ ఎమ్మెల్యే కంటే బాగా పనిచేసేవారు ఉన్నారని భావిస్తే మార్చుకోవడంలో తప్పేముంది?” అని ఎదురు ప్రశ్నించారు.
రజనీకాంత్ స్పందిస్తూ “అంటే నాలుగున్నరేళ్ళుగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేకపోయారని మీరు ఒప్పుకొన్నట్లే కదా?అలాంటప్పుడు కొత్తగా వచ్చినవారు మిగిలిన ఈ రెండు మూడు నెలల్లో ఏం చేయగలరు? ప్రజల నమ్మకం ఎలా పొందగలరు?” అంటూ మళ్ళీ ఎదురు ప్రశ్నించారు.
దీంతో జూపిడి వైసీపికి అలవాటైన ఎదురుదాడి మొదలుపెట్టేసి, “మీ కుర్చీలో మరొకరు కూర్చొన్నప్పుడు, మీ ఇద్దరిలో ఎవరు బాగా పనిచేస్తారో బేరీజు వేసుకొని చూస్తాము కదా?అలాగే ఇదీను. మేము మా ఎమ్మెల్యేలను మార్చుకొంటే మీకేందుకు అభ్యంతరం?” అని ఎదురు ప్రశ్నించారు.
Big News Big Debate : రజనీకాంత్ ప్రశ్నకు వైసీపీ నేత షాక్.. నో ఆన్సర్ – TV9#rajinikanthvellalacheruvu #bignewsbigdebate #tv9telugu pic.twitter.com/VN7cW6G5B6
— TV9 Telugu (@TV9Telugu) December 12, 2023




