జ్యోతికను అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు

Actress Jyothika faces trolling on social media over a viral scene from the web film System.

నిన్న అమెజాన్ ప్రైమ్ లో “సిస్టమ్” అనే వెబ్ ఫిలిం రిలీజ్ అయ్యింది. అందులో సోనాక్షి సిన్హా, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించారు. న్యాయ వ్యవస్థలోని లొసుగుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో జ్యోతిక ఓ ఆధునిక మహిళా లాయర్ గా నటించింది. జ్యోతిక పోషించిన సారిక రావత్ అనే పాత్ర, పెళ్లైన ఓ మగాడితో సెక్సువల్ రిలేషన్ లో ఉంటుంది.

ఆ రిలేషన్ ను చూపించడం కోసం ఓ బెడ్ సీన్ పెట్టారు. ఆ సీన్ లో జ్యోతిక ఎలాంటి ఇబ్బందికరమైన భంగిమలోనూ కనిపించదు, తిప్పికొడితే 15 సెకండ్ల ఆ సన్నివేశంలో జ్యోతిక తన బాటమ్ వేర్ ను సర్దుకుంటూ ఉంటుంది. ఆ చిన్న క్లిప్ ని పట్టుకుని “వామ్మో జ్యోతిక బోల్డ్ సీన్” అంటూ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ చేస్తున్నారు. అది సరిపోదన్నట్లు.. ఇద్దరు పిల్లల తల్లి ఇలాంటివి చేయొచ్చా అంటూ నీతి బోధలు చేస్తున్నారు.

ADVERTISEMENT

అయితే.. ఇదంతా జ్యోతిక నటించిన సన్నివేశం గురించో లేక పోషించిన పాత్ర గురించో కాదు.. గతంలో “కంగువ” టైంలో జ్యోతిక ట్రోలర్స్ మీద విరుచుకుపడడమే ఇందుకు కారణం అని చెప్పొచ్చు. దాంతో ఇప్పుడు వాళ్ళందరూ చాన్స్ దొరికింది కదా అని ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా ఓ మంచి నటి, తల్లి, సూర్య సతీమణి అయిన జ్యోతికను ఇలా బోల్డ్ సీన్, వల్గర్ సీన్ అంటూ ఆమె చేయనటువంటి ఓ పనిని ఆమెపై రుద్దడం అనేది ముమ్మాటికీ తప్పు. జ్యోతిక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోదు అనుకోండి కానీ.. నెటిజన్లు కూడా మరీ ఇలాంటివి గుడ్డిగా నమ్మేసి, షేర్లు చేసి, కామెంట్స్ చేయడం లాంటివి మానుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories