వారం రోజుల్లో యుద్ధం సమాప్తం: కేఏ పాల్!

KA Paul speaking about Iran Israel war and claiming peace talks could end the conflict within a week 1

ప్రపంచ దేశాలలో ఎక్కడ ఏ యుద్ధం జరిగిన ఐఖ్యరాజ్య సమితి కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటుంది. మిత్ర దేశాలు ‘నిశితంగా గమనించే’ ప్రేక్షకపాత్రకు పరిమితమవుతాయి. ‘చర్చలతోనే శాంతి సాధ్యం’ అంటూ సుద్దులు చెపుతుంటాయి.

కానీ మన తెలుగువాడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రీస్టియన్ మత బోధకుడు కేఏ పాల్ వెంటనే చొరవ తీసుకొని ఆయా దేశాదినేతలు లేదా వారి ప్రతినిధులతో సమావేశమై సమస్యని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటారు.

ADVERTISEMENT

అయన మాటలు, చేష్టలు, వ్యవహారశైలి, ప్రచారయావ చూసి అందరికీ ఆయన కామెడీ నటుడో సర్కస్ బఫూనో అనిపించవచ్చు. కానీ ఆయన నేరుగా దేశాధినేతలతో సమావేశమయ్యి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారంటే ఎవరికీ నమ్మశక్యం కాదు.

కానీ వాస్తవం మాత్రం అదే. ఇటీవలే ధిల్లీలో ఇరాన్‌ అధినేత ప్రతినిధితో సమావేశమై నేరుగా మాట్లాడిన కేఏ పాల్, ఆ తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ముఖ్య నేతలతో సమావేశమై యుద్ధం నిలిపేయాలని కోరానని చెప్పారు. లేకుంటే ఇది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందని, అప్పుడు కోట్లాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారని నచ్చజెప్పానన్నారు.

ఈ యుద్ధం వలన అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు ఆర్ధిక వ్యవస్థలు అస్తవ్యస్తమవుతున్నాయని అందరికీ నచ్చజెప్పానన్నారు. తాను మాట్లాడిన వారందరూ సానుకూలంగా స్పందించారని, బహుశః వారం పది రోజులలోనే ఈ యుద్ధం ముగిసిపోతుందని కేఏ పాల్ చెప్పారు.

ఆయన చెప్పిన ఈ మాటలు కూడా నమ్మశఖ్యంగా అనిపించకపోవచ్చు. కానీ అందరూ చేతులు ముడుచుకొని చూస్తున్నప్పుడు ఈ యుద్ధం ఆపేందుకు ఆయన చేసే చిన్న ప్రయత్నమైన గొప్పదేగా? నాడు రాముడు లంకకు వారధి కడుతుంటే ఉడత కూడా సాయపడింది. కేఏ పాల్ కూడా అదే చేస్తున్నారనుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories