ట్రైలర్ టాక్ – బిచ్చగాడు + భేతాళుడు!

Kaasi-Trailer-Vijay-Antonyవినూత్నమైన సినిమాలను మాత్రమే చేస్తారన్న టాక్ తమిళ హీరో విజయ్ అంటోనీ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ‘బిచ్చగాడు’ సూపర్ సక్సెస్ తర్వాత డబ్బింగ్ రైట్ కొనుగోలు చేసే నిర్మాతలతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా విజయ్ సినిమాల వైపుకు చూస్తున్నారు. కానీ ఆ తర్వాత ఆ అంచనాలను అందుకోవడంలో విజయ్ సినిమాలు వరుసగా విఫలమవుతూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో… మరోసారి తను నమ్ముకున్న కొత్తదనాన్నే పణంగా పెట్టి “కాశి” అనే సినిమాను తెరకెక్కించాడు.

ADVERTISEMENT

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ తమిళంలో విడుదల కాగా, తాజాగా తెలుగులో కూడా రిలీజ్ చేసారు. విజయ్ అంటోనీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా కట్ చేసారు. తన పూర్వజన్మ తెలుసుకునేందుకు బయలుదేరిన వ్యక్తి, గత జన్మ తెలుసుకోవడం, అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో ట్రైలర్ ను నింపేసారు. అయితే ట్రైలర్ చూస్తున్నంత సేపు ‘బిచ్చగాడు + భేతాళుడు’ సినిమాలు గుర్తుకు రావడం మైనస్ పాయింట్స్. దీంతో ఇదే తరహా సినిమాలు చేస్తున్నాడన్న టాక్ విజయ్ సొంతం చేసుకుంటున్నాడు.

ADVERTISEMENT
Latest Stories