కడప రెడ్డెమ్మ కుర్చీ సమస్య…ఫుల్ స్టాప్ లేదా.?

Kadapa MLA’s Ongoing Chair Disputes

ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యే కి ఎదురవ్వని కుర్చీ సమస్య ఒక్క కడప టీడీపీ మహిళా ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి కి ఎదురవుతుంది, అదే హై లైట్ అవుతుంది. వై.?

నేడు కడప పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా మాధవి రెడ్డి కి ఈ కుర్చీ సమస్య ఎదురయ్యింది. ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీద తనకు కుర్చీ వేయలేదని, అక్కడ అధికారులకు మాత్రమే కుర్చీలు ఏర్పాటు చేసారంటూ మాధవి రెడ్డి జిల్లా కలెక్టర్ పై సీరియస్ అయ్యారు.

ADVERTISEMENT

ఎమ్మెల్యే ప్రోటోకాల్ తెలియదా మీకు.? బాధ్యత లేదా.? అంటూ అక్కడి ప్రభుత్వ అధికారుల పై మాధవి లతా మండిపడ్డారు. సమాచారం తెలుసుకున్న అధికారులు తిరిగి ఆమెను స్టేజ్ మీదకు ఆహ్వానించినా అందుకు ఆమె నిరాకరిస్తూ అధికారుల పై అసహనం వ్యక్తం చేస్తూ అక్కడే నిలబడి కార్యక్రమాన్ని పూర్తి చేసారు.

అయితే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుర్చీ సమస్య అనేది ఈనాటిది కాదు, ఆమె 2024 ఎన్నికలలో గెలిచిన నాటి నుంచి ఎదో ఒక సందర్భంలో ఇలా కుర్చీ సమస్యను ఎదుర్కొంటూనే వస్తున్నారు, అది మీడియాలో హై లైట్ అవుతూనే వస్తుంది.

కడప మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహణలో కూడా మాధవి రెడ్డి కి ఈ కుర్చీ సమస్య తలపోటుగా మారింది. ఇక్కడ వైసీపీ నేతలు తనకు వ్యతిరేకంగా కుర్చీలాట మొదలుపెట్టారంటూ మండిపడిన మాధవి వేదిక మీద ఎమ్మెల్యే అయిన తనకు కుర్చీ వేయకుండా అవమానిస్తున్నారు అంటూ సమావేశం మొత్తం నిలుచునే తన నిరశన తెలియచేసారు.

ఇక ఇప్పుడు ఇక్కడ స్వతంత్ర వేడుకలలో సైతం మాధవికి ఈ కుర్చీలాట తప్పలేదు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ప్రోటోకాల్ అంటూ ప్రత్యేకించి కుర్చీలంటూ ఉండవని అధికారులు వాపోతున్నప్పటికీ వచ్చిన వారు కూర్చోవడానికి కుర్చీ వేస్తే ఏమవుతుంది అనే ప్రశ్న అధికారులకు ఎదురవ్వగా,

ఇటువంటి వేడుకలలో కుర్చీల కోసం అధికారులను దూషించడం, అందునా పబ్లిక్ మీటింగ్ వంటి కార్యక్రమాలలో జాయింట్ కలెక్టర్ పై ఎమ్మెల్యే రుసరుసలాడం అవసరమా అన్న ప్రశ్న మాధవి రెడ్డి ని వెంటాడుతుంది.

ఈ వివాదంలో ఇరు వర్గాలు కాస్త ఆలోచనగా, సంయమనంగా వ్యవహరించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. అయితే ఈ కడప ఎమ్మెల్యే కుర్చీ సమస్యకు పరిష్కారం సాధ్యమేనా.?

ADVERTISEMENT
Latest Stories