టాలీవుడ్ టాప్ హీరోయిన్లు సమంత, కాజల్ ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారు. ఇప్పటికే ‘బృందావనం’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తమిళ స్టార్ విజయ్ సినిమాలో నటించనున్నారని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ సరసన కాజల్, సమంత నటించనున్నారని, వారితో పాటు ఎస్ జే సూర్య, జ్యోతిక, శివరాజ్ కుమార్ లు నటించనున్నారని కూడా తెలిపారు.
జ్యోతిక, సమంత, కాజల్ పాత్రలకు సమ ప్రాధాన్యం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సినిమాకు అట్లీ కుమార్ దర్శకత్వం వహించనున్నాడని, భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సినిమా కథ, కథనాలు అందర్నీ ఆకట్టుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో సమంత – కాజల్ కాంభినేషన్ లో వచ్చిన ‘బృందావనం’ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మార్క్ ను వేసుకోగా, ‘బ్రహ్మోత్సవం’ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీంతో ఈ హ్యాట్రిక్ చిత్ర ఫలితం ఏమవుతుందో చూడాలి.
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



