‘కళానికేతన్’ ఎండీ విషయంలో అసలు ఏం జరిగింది?

Kalaniketan MD Leela Kumar wife Arrestరెండు తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని సంవత్సరాలుగా ‘కళానికేతన్’ పేరుతో వస్త్ర వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్న లీలా ప్రసాద్ భార్య కళానికేతన్ లో డైరెక్టరుగా ఉన్న లక్ష్మీ శారదను పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్ లోని ఫిలింనగర్ సినారీ వ్యాలీలో అరెస్ట్ చేసారు. ఈ కేసును నమోదు చేసిన ధర్మవరం పోలీసులు కళానికేతన్ ఎండీ మరియు అతని భార్యల తప్పుందని తేల్చి వారిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు.

పోలీసుల రాకను గమనించిన లీలా ప్రసాద్ తప్పించుకుపోగా, లక్ష్మీ శారద ఇంటి బాత్ రూములో దాక్కున్నారు. ఎంతసేపు పిలిచినా తలుపు తీయకపోవడంతో, విషయాన్ని బంజారాహిల్స్ పోలీసులకు చెప్పి, వారి సమక్షంలో తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మీడియా ప్రశ్నించిన సమయంలో అసలు నోరు మెదకపోవడం విశేషం.

ADVERTISEMENT

అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతంలో 80 మందికి పైగా చేనేత వస్త్రాల తయారీదారుల నుంచి 9 కోట్ల విలువైన వివిధ రకాలైన వస్త్రాలు కొనుగోలు చేసి, వారికి డబ్బు చెల్లించకపోవడంపై గత జనవరిలో ఫిర్యాదులు వచ్చాయి.ఈ ఆ మీదట కేసులు నమోదు చేసిన ధర్మవరం పోలీసులు కళానికేతన్ ఎండీ లీలా ప్రసాద్ కోసం గాలించారు. లీలాప్రసాద్ పరారవ్వడంతో, లక్ష్మీ శారదను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. ధర్మవరం కోర్టులో హాజరు పరచగా, ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించారు.

అయితే ఎలాంటి సందర్భంలోనూ లక్ష్మీశారద ముఖాన్ని మీడియా కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. కోర్టులో న్యాయమూర్తి ముందు సంతకం పెడుతున్న సందర్భంలోనూ మీడియా కెమెరాలను చూసిన ఆమె… తన ముఖం కనపడనీయకుండా, నిండా ముసుగేసుకుని మరీ సంతకం చేసారు. ఈ అరెస్ట్ పరిణామంతో ఆగిపోకుండా తమకు తగిన న్యాయం చేయాలంటున్నారు బాధితులు.

ADVERTISEMENT
Latest Stories