polavaram-kaleshwaram-

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సాగునీటి శాఖలో కొత్తగా నియమితులైన ఇంజనీర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కొత్తగా ఇంజనీర్లుగా చేరుతున్న మీరందరూ ఓ ప్రాజెక్ట్ ఎలా కట్టకూడదో కాళేశ్వరంని చూసి తెలుసుకోవాలి. ఓ ప్రాజెక్ట్ చిరకాలం నిలబడేలా ఏవిదంగా నిర్మించాలో నాగార్జున సాగర్, శ్రీశైలం, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, భాక్రానంగల్ వంటి ప్రాజెక్టులను చూసి నేర్చుకోవాలి.

Also Read – వైఎస్ స్పూర్తి.. వద్దు పైనున్న ఆయన బాధపడతారు!

నాడు కేసీఆర్‌ సుమారు లక్షన్నర కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తే మూడేళ్ళలోనే అది క్రుంగిపోయింది. కానీ దశాబ్ధాల క్రితం కట్టిన ప్రాజెక్టులు నేటికీ చెక్కు చెదరలేదు. లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి.

అంత ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఉపయోగపడటం లేదు. కానీ దానితో కేసీఆర్‌ కుటుంబం మాత్రం బాగుపడింది.

Also Read – వైసీపీ రాజకీయాలు మారాయి… మరి టీడీపీ?

కనుక ప్రాజెక్టుల విషయంలో ఇంజనీర్లు, ఉన్నతాధికారులు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ళకు తలొగ్గకుండా తమపని తాము చేయడం చాలా అవసరం. లేకుంటే ప్రాజెక్టులు ఇలాగే పేక మేడల్లా కూలిపోతుంటాయి. అప్పుడు మీరు జైలు పాలవుతారు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుని కేవలం మూడేళ్ళలోనే నిర్మించడం, అప్పుడే కూలిపోతుండటం చాలా బాధాకరమే. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా నాలుగు ముక్కలు చెప్పుకోక తప్పదు.

Also Read – సంక్షేమ పధకాలతోనే వైసీపీని హైజాక్.. భలే ఉందే!

రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఓ ప్రాజెక్టుని ఏవిదంగా నిర్మించరాదో అర్దం చేసుకోవడానికి పోలవరం ప్రాజెక్టు కూడా చక్కటి ఉదాహరణ.

దీని నిర్మాణం దశాబ్ధాలుగా కొనసాగుతున్నా నేటికీ పూర్తికాలేదు. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ దాని పరిస్థితిలో ఎటువంటి మార్పు కనపడటం లేదు.




ఈ ప్రాజెక్టుని మూడేళ్ళలో పూర్తి చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెపుతున్నారు. అప్పటికైనా పూర్తి చేస్తే సంతోషమే కానీ కేసీఆర్‌లా హడావుడిగా నిర్మిస్తే కధ మళ్ళీ మొదటికొస్తుంది. అప్పుడు కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులు దేశంలో నిరూపయోగమైన ప్రాజెక్టులుగా, పాలకుల అసమర్ధత, అవినీతికి నిలువెత్తు నిదర్శనాలుగా మిగిలిపోతాయి.