డైరెక్టుగా ఓటీటీలో మెగా సినిమా!

kalyaan Dhev super machi movie direct on OTTమెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ విజేత అనే డిజాస్టర్ సినిమా తో సినీరంగ ప్రవేశం చేశారు. అతని రెండవ చిత్రం సూపర్ మచ్చి అక్టోబర్ 2019 లో మొదలయ్యింది. ఆర్థిక సమస్యలు, రీషూట్లు మరియు కరోనా కారణంగా ఈ చిత్రం చాలా ఆలస్యం అయింది. ఈ ఏడాది మొదట్లో సినిమాలు విడుదల అయ్యే సమయానికే సినిమా రెడీగా ఉన్నా నిర్మాతలు రిలీజ్ చేసుకోలేకపోయారు.

కోవిడ్ రెండవ వేవ్ ఉదృతి తగ్గిన వెంటనే బాక్సాఫీస్ వద్ద పెద్ద చిత్రాల రద్దీ ఉంటుంది… చిన్న సినిమాలు మంచి విడుదల పొందడం కష్టమవుతుంది. కాబట్టి, సూపర్ మచ్చి బృందం ఓటీటీ విడుదల కోసం ఆలోచిస్తోంది. బజ్ ఏమిటంటే, నిర్మాతలు ఓటీటీ విడుదల కోసం వెళ్లాలని నిర్ణయించుకుని… వివిధ ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నారు.

ADVERTISEMENT

ఏదైనా ఒప్పందం కుదిరితే అధికారిక ప్రకటన ఉంటుంది. అయితే సినిమా చాలా ఆలస్యం కావడం… అలాగే కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఓటీటీ కంపెనీలు ఆలోచనలో పడ్డాయట. ఈ చిత్రం ప్రముఖ కన్నడ నటి రచిత రామ్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా. ఈ చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహించగా, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.

కల్యాణ్ దేవ్ ఇప్పటికే తన తదుపరి చిత్రం షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. ఒకవేళ ఈ సినిమా ఓటీటీ బాట పడితే కోవిడ్ సెకండ్ వేవ్ లో థాంక్ యూ బ్రదర్, ఏక్ మినీ కథ తరువాత డైరెక్టుగా ఆన్ లైన్ లో విడుదలయ్యే మూడవ తెలుగు చిత్రం అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories