‘అజ్ఞాతవాసి’ని వాడుకుంటున్న ఎమ్మెల్యే!

kalyan-ram-mla-trailer-at-agnyaathavaasi-theatresత్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “అజ్ఞాతవాసి” సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అడ్వాన్సు బుకింగ్స్ తో ధియేటర్లు కళకళలాడుతుండగా, తాజాగా ఈ సినిమా విడుదల కోసం నందమూరి హీరో కూడా ఎదురు చూస్తున్నాడు. ‘అజ్ఞాతవాసి’ సినిమా మధ్యలో తన సినిమా ట్రైలర్ ను ప్రదర్శితం కానుండడంతో కళ్యాణ్ రామ్ ఈ నెల 10వ తేదీ కోసం పవన్ అభిమానులతో పాటు ఈ నందమూరి హీరో కూడా ఆసక్తిగా నిరీక్షిస్తున్నాడు.

ADVERTISEMENT

పవన్ ‘అజ్ఞాతవాసి’ సినిమా ఇంటర్వెల్ సమయంలో… కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ “ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి)” ట్రైలర్ ను ప్రదర్శించడానికి సర్వం సిద్ధమయ్యాయి. కళ్యాణ్ రామ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న “ఎమ్మెల్యే” సినిమాతోనైనా తనకు బ్రేక్ లభిస్తుందని కళ్యాణ్ రామ్ ఆశిస్తున్న నేపధ్యంలో… ఈ సినిమాకు పబ్లిసిటీగా ‘అజ్ఞాతవాసి’ వినియోగించుకోవడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories