తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ పుట్టే టైమ్ వచ్చినట్టు ఉంది. స్టార్ హీరొ కమల్ హాసన్ ఇటీవలే కాలంలో పొలిటికల్ కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తా అని క్ల్యారిటీ ఇచ్చిన కమల్ వచ్చే తన పుట్టినరోజు నాడున ఒక కీలక ప్రకటన చేస్తా అని చెప్పారు.
ADVERTISEMENT
నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు. కావున అదే రోజున కమల్ పార్టీని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తమిళ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతుంది. ఐతే ఇప్పటిదాకా ఆయన దానిని ధృవీకరించలేదు.
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళ నాట రాజకీయ శూన్యత ఏర్పడింది. ప్రజలు మార్పు కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే రాజినీకాంత్, కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.
ADVERTISEMENT


