‘వైరల్’గా మారిన కమల్ పోస్ట్ చేసిన ‘సెన్సేషన్’ వీడియో!

Kamal Haasan Tweet on Police assault on Jallikattu Protestతమిళనాడులో జల్లికట్టు కోసం గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా కొనసాగిన ఆందోళనలు సోమవారం నాడు తీవ్ర రూపం దాల్చి, హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. నిరసనకారులు పోలీసులపై దాడికి తెగబడడంతో పాటు, మెరీనా బీచ్ సమీపంలోని పోలీస్ స్టేషన్ పై దాడి చేసి, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో చెన్నై నగరంలో తీవ్ర అలజడి చెలరేగింది. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు కమలహాసన్ ఓ షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

నిరసన సమయంలో ఓ పోలీసే ఆటోకు నిప్పు పెడుతున్న దృశ్యాలు సదరు వీడియోలో ఉండడం అందరినీ షాక్ కు గురి చేస్తోన్న విషయం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏంటి పోలీసులే ఇలాంటి పని చేశారా? అంటూ అందరూ మండిపడుతున్నారు. అయితే, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియన్ పోలీసు అధికారి శంకర్ స్పష్టం చేశారు. ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అని, దీనిపై విచారణ జరుపుతామని మరో పోలీసు అధికారి రాజేంద్రన్ తెలిపారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories