నిన్న విజయవాడలో ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ మరో రెండు, మూడు నెలల్లో చంద్రబాబు పదవి ఊడటం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దీనితో కేంద్రంలోని బీజేపీ చంద్రబాబు ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా అనే అనుమానాలు రాకమానదు.
[m9ad]
ఇప్పటికే తెలంగాణాలో రేవంత్ రెడ్డి మీద ఐటీ రైడ్లు జరిగాయి. రేవంత్ తో పాటు ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న ఉదయ్ సింహా, సెబాస్టియన్ ల ఇళ్ళను కూడా రైడ్ చేసారు. వారిని ఎంక్వయిరీకి కూడా పిలిచారు. ఎల్లుండి రేవంత్ రెడ్డిని విచారణకు రమన్నారు. నిన్న పలు ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా ఈ రైడ్లు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.
దీని బట్టి చంద్రబాబును ఇరుకున పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు రాక మానవు. తెలంగాణ ఎన్నికలు పూర్తి అవ్వడానికి రెండు మూడు నెలలు పట్టవచ్చు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా మరో రెండు, మూడు నెలల్లో చంద్రబాబు పదవి ఊడటం ఖాయమని అంటున్నారు.
తెలంగాణ ఎన్నికలకు ముందు చంద్రబాబును టచ్ చేస్తే అది మహాకూటమికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ తంతు పూర్తయ్యాక చంద్రబాబు మీద దృష్టి సారిస్తారా అనే అనుమానం రాకమానదు. అదే జరిగితే గనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కడం ఖాయం. దాని వల్ల బీజేపీకి చేటు చేస్తుందో లబ్ది చేకూరుతుందో చూడాలి



