టీడీపీ ఆరిపోయే దీపమే అనుకుందాం… మరి బీజేపీ ఏంటో?

Kanna - Lakshmi - Narayana - Chandrababu Naiduఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఈ సారి ఒంటరి జరిపింది. గత ఎన్నికలలో టీడీపీ బలం మీద గుప్పెడు సీట్లు సాధించింది. అయితే ఈ సారి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. గట్టిగా 1% ఓట్లు వస్తే గొప్ప అన్నట్టు ఉంది ఆ పార్టీ పరిస్థితి. ఓట్ల శాతం, డిపాజిట్లు పోగొట్టుకోవడంలో కాంగ్రెస్ తో పోటీ పడబోతోంది. ఇది ఆ పార్టీ స్వయంకృతాపరాధమే. ఇంకో విషయం ఏమిటంటే ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలు ఏకంగా అధికారం తమదే అన్న రేంజ్ లో ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే వారు.

అయితే ఎన్నికల సమయానికి పూర్తిగా చల్లబడ్డారు. పైపెచ్చు ఎన్నికల ఖర్చులకు పార్టీ పంపిన డబ్బు కూడా బొంకేశారు కొందరు. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో మళ్ళీ నోటికి పని చెప్పారు. “బాబు, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువలా ఉంది నీ మానసిక స్థితి.! ఏ ఎజెండాతో క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నావ్? 1999,2004లో నువ్వు సీఎంగా ఎన్నికలు ఎదుర్కొన్నపుడు ఆపద్ధర్మ సీఎంగా ఇలా సమీక్షలు చేయలేదు. ఇప్పుడు “దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా” సీఎం కుర్చీ విలువ దిగజారుస్తున్నావ్,” అని ట్విట్టర్ లో విమరించారు కన్నా లక్ష్మీనారాయణ.

ADVERTISEMENT

సరే టీడీపీ ఆరిపోయే దీపమే అనుకుందాం అయితే ఆ మాట బీజేపీ అనొచ్చా? అసలు నరసరావుపేట ఎంపీ స్థానానికి పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ రెండో స్థానంలోనైనా నిలిచే అవకాశం ఉందా? 175 స్థానాలలో కనీసం 150 చోట్ల డిపాజిట్లు పోతాయి. అంతకంటే ఎక్కువ పోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే ఏంటో కూడా తెలీదు. చంద్రబాబు ఇప్పుడు పూర్తి స్థాయి ముఖ్యమంత్రి కాకపోతే కోడ్ అమలు లో ఉండటం కొన్ని అధికారాలు ఉండకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories