గవర్నరా లేక బీజేపీ ఏజెంటా?

Kanna Lakshminarayana - Narendra - Modiబీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం ప్రధానమంత్రి మోడీని ఢిల్లీలో కలిశారు. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ తిరిగిరాలేదు. మరికొన్ని రోజులు దేశరాజధానిలోనే ఉండాలని ఆయనకు చెప్పినట్టు సమాచారం. 15న గవర్నర్ నరసింహన్ ఢిల్లీ రాబోతున్నారని ఆయన సమక్షంలో మరోసారి సమావేశం అవుదామని కన్నాకు చెప్పినట్టు సమాచారం.

ADVERTISEMENT

కన్నా రెండు రోజులుగా ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విషయాలపై ప్రెస్ మీట్లు పెడుతున్నారు. రాజ్యాంగపదవిలో ఉన్న గవర్నర్ ను రాజకీయ చర్చలు, సమావేశాల్లో కూర్చోబెట్టడం బీజేపీ రాజకీయ దిగజారుడుతనం కాకా మరొకటి కాదు. అనుకూలంగా ఉండబట్టే ఇప్పటికే పదవీ కాలం పూర్తయినా ఆయనను కొనసాగిస్తున్నారు కేంద్రంలోని పెద్దలు.

పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర, జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర, కేంద్రంపై చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటం వంటి వాటిపై సమగ్ర నివేదిక గవర్నర్ తీసుకుని రాబోతున్నట్టు సమాచారం. యూపీఏ కాలంలో నియమించబడ్డ నరసింహన్ ను బీజేపీ కూడా కొనసాగిస్తోంది. నియమించింది కాంగ్రెస్ అయినా కొద్దీ కాలంలోనే మోడీ అమిత్ షాలకు నమ్మకస్తుడిలా మారిపోయారు ఆయన.

ADVERTISEMENT
Latest Stories