కర్ణాటక పీఠం ఎవరికి? సస్పెన్స్ కొనసాగబోతుందా?

karnataka-cm-race-bjp-vs-jds-congress-allianceబల నిరూపణ పరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించడంతో కర్ణాటక రాజకీయం ఊహించని మలుపుతిరిగింది. బలపరీక్ష తీర్మానంపై మాట్లాడిన సందర్భంలోనే సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనివార్యమైంది.

అయితే ఇప్పటికీ గవర్నర్ కుమారస్వామికి అవకాశం ఇవ్వాలని లేదట. కుమారస్వామి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేరు అనే నెపంతో ఆయన రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉంది. అలా జరిగితే కర్ణాటక మళ్ళీ ఎన్నికలకు వెళ్లొచ్చు. అయితే గవర్నర్ వాజూభాయ్ వాలా ఇక రిస్క్ తీసుకోరని కుమారస్వామికి అవకాశం ఇస్తారని పరిశీలకులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

అన్నీ కుదిరితే ఈరోజే కుమారస్వామికి గవర్నర్‌ నుంచి పిలుపు రానున్నట్లు తెలిసింది. ఆలాగే ఈ రోజే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని కన్నడ రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మంత్రిపదవుల భేరసారాల్లో కాంగ్రెస్ జేడీఎస్ ముంగిపోయినట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories