శనివారం మే 19… సాయంత్రం 4 గంటలకు..!

Yeddyurappa -BJPకర్ణాటక రాష్ట్ర ప్రజలతో పాటు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమయం… శనివారం మే 19… సాయంత్రం 4 గంటలు..! అప్పుడే కర్ణాటక బాక్స్ బద్ధలయ్యేది! “ఎలాగైనా” అధికారంలోకి రావాలని బిజెపి ఓ పక్క… అణచివేత ధోరణిని అణగద్రొక్కాలని కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి మరో పక్క..! ఎవరు విజయం సాధిస్తారు? అనే దానిపైనే ఈ శనివారం నాడు దేశమంతా ఎదురుచూస్తోంది. ఎవరికీ వారు తమదే గెలుపు అంటూ ప్రగల్భాలు పలుకుతున్నా… చివరి నిముషంలో కధ ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT

బిజెపి తరపు నుండి గాలి రంగంలోకి దిగడంతో పాటు సామదానభేడదండోపాయాలన్నీ కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోందని వినికిడి. అలాగే మరోవైపు సెల్ ఫోన్స్ కూడా వినియోగించవద్దని తమ నేతలకు కాంగ్రెస్, జేడీఎస్ లు ఆదేశాలు ఇచ్చింది. రాజకీయం రుచి ఏమిటో తెలిపే విధంగా మారిన ఈ ఉత్కంఠ పోరు ఫైనల్ గా ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచిచూద్దాం. ఎవరు గెలిచినా… చివరకు చెప్పేది… “ధర్మమే గెలిచింది” అని! గెలుపు కోసమే రాజకీయం… ఎలా గెలిచినా అది ధర్మమే… అదే నవ “భారతీయ జనతా” రాజకీయ పాఠం…!

ADVERTISEMENT
Latest Stories