జైలుకెళ్ళిన ప్రతీ ఒక్కరికీ వీరతాళ్ళు వేయరా?

Karumuri Nageswara Rao: From Minister to Jail

వైసీపీ హయంలో ఓ వెలుగు వెలిగిన వారందరూ ఇప్పుడు పోలీస్ స్టేషనలు, కోర్టుల చుట్టూ తిరగక తప్పడం లేదు. వారిలో అనేకమంది జైలుకి వెళ్ళి బెయిల్‌పై బయటకు రాగా, మరికొందరు జైలు-బెయిల్‌ మధ్యంతర దశలలో ఉన్నారు.

మద్యం కుంభకోణం, మద్యం రవాణా కుంభకోణం, వివేకా హత్య కేసు వంటి పెద్ద కేసులు ఇప్పట్లో తేలేవి కావు. కనుక ఒక్కసారి బెయిల్‌ సంపాదించుకొని బయట పడగలిగితే ఇక ఆ కేసు నుంచి విముక్తి లభించినట్లే భావించవచ్చు.

ADVERTISEMENT

కానీ టీడీపి కార్యాలయాలపై దాడులు, భూకబ్జాలు, హత్యలు, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు వంటివి స్వయంకృతాపరాదాలే కదా? అలాంటి చిన్న కేసులలో చిక్కుకుంటే వైసీపీ తరపున న్యాయసాయం లభిస్తుందనే గ్యారంటీ ఉండకపోవచ్చు.

కనుక వాటిలో చిక్కుకొని జైలు పాలు అయిన నేతలను జగన్‌ పరామర్శించి ‘వీరతాళ్ళు’ వేయకపోవచ్చు. అలాగని మద్యం.. రవాణా కుంభకోణాలలో చిక్కుకున్న ప్రతీ ఒక్కరినీ జగన్‌ పరామర్శిస్తారని గ్యారెంటీ కూడా లేదు. కనుక జగన్‌ చేత వీరతాళ్ళు వేయిన్చుకోవాలంటే దానికీ ఓ లెక్క, ఓ అర్హత ఉంటుందనుకోవచ్చు.

మద్యం రవాణా కుంభకోణంలో అరెస్ట్ ఆయన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావున ఈడీ అధికారులు అరెస్ట్ చేసి చంచల్ గూడా జైల్లో పెడితే, జగన్‌ పరామర్శించకపోవడం ఇందుకు చక్కటి ఉదాహరణ.

బహుశః తాను మరిచిపోవాలనుకుంటున్న చేదు జ్ఞాపకాలను మళ్ళీ ఆ జైలు గుర్తు చేస్తుందని కావచ్చు. కనుక జగన్‌ని నమ్ముకొని, అయన హయంలో చెలరేగిపోయిన కారుమూరికి ‘వీరతాడు’ లభించలేదు.

ఈ కేసుపై విచారణ జరుపుతున్న సిట్‌ అధికారులు కోర్టు అనుమతితో ఆయనని పీటీ వారెంట్ మీద చంచల్ గూడా జైలు నుంచి కస్టడీ కోసం విజయవాడ తీసుకు వచ్చారు. ఆయనని ఏసీబీ కోర్టులో హాజరు పరుచాగా ఈ నెల 25 వరకు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకి తరలించారు.

సిట్‌ అధికారులు ఒకటి రెండు రోజులలో ఆయనను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించి ముగియగానే మళ్ళీ జైలు అధికారులకు అప్పగిస్తారు.

ఈ ప్రక్రియ అంతా సర్వ సాధారణంగా సాగేదే కానీ రాజకీయాలలో మంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తికి ఇది చాలా అవమానకరమే కదా?భవిష్యత్‌లో ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని తెలిసి ఉన్నప్పటికీ, ఎప్పటికీ మా పార్టీ, మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందనే ధైర్యం, నమ్మకంతోనే చేయకూడని పనులు చేసి, జైలు జీవితం రుచి చూడటం అవసరమా?అని ప్రతీ ఒక్క రాజకీయ నాయకుడు ఆలోచిస్తే మంచిది కదా?

ADVERTISEMENT
Latest Stories