‘కాటమరాయుడు’ అప్ డేట్స్… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ…!

katamarayudu-release-updates-postersఅభిమానులను అలరించేందుకు సర్వాంగ సుందరంగా ‘కాటమరాయుడు’ సిద్ధమవుతున్నాడు. శరవేగంగా జరుగుతున్న షెడ్యూల్స్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తెలుగు కొత్త సంవత్సరంగా భావించే ఉగాది నాటికి ఈ సినిమాను తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంగా భావించే జనవరి 1వ తేదీన అభిమానులను పలకరించేందుకు ‘కాటమరాయుడు’ ముస్తాబవుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత శరత్ మరార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు ‘కాటమరాయుడు’ రెడీ అవుతున్నారని, దీనికి సంబంధించి పోస్టర్ విడుదల సమయం, తేదీని అభిమానులకు తెలియజేస్తామని… శరత్ మరార్ చెప్పడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం ఉరకలేస్తోంది. దీపావళి విడుదలైన ‘కాటమరాయుడు’ పోస్టర్ లో పవర్ స్టార్ సింపుల్ లుక్ లో కనపడడంతో, ఈ సారి అదిరిపోయే విధంగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ పూర్తి కావడంతో ఓ 15 రోజుల పాటు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories