మరో రెండు రోజుల్లో తెలంగాణా రాష్ట్రం మొత్తం ఎన్నికల హడావిడితో బిజీ బిజీ గా ఉంటుంది. ఎవరికి వారు తమకు నచ్చిన నాయకుణ్ణి ఎన్నుకునే పనిలో ఉంటారు. మరో పక్క ఆరోజు సెలవు దినం కూడా. అయితే ఒక పక్క ఎన్నికల సంగ్రామం జరుగుతూ ఉంటే, మరో పక్క ఒకటి కాదు రెండు కానీ ఏకంగా మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుని దశలో అదే రోజు ప్రేక్షకుల ముంకుకు వచేస్తున్నాయి.
[m9ad]
అందులో ఒకటి అక్కినేని సుమంత్ నటించిన “సుభ్రమణ్యపురం”కాగా, మరొకటి లవ్లీ డాల్ తమన్నా-సందీప్ కిషన్ నటిస్తున్న “నెక్స్ట్ ఏంటి”. ఇక ఈ కోవలోనే బెల్లంకొండ శ్రీనివాస్ “కవచం” కూడా ఇదే రోజు రిలీజ్ కి సిద్దం కావడం విశేషం. అయితే ఎన్నికల రోజున రిలీజ్ అంటే సినిమాలకు ఏమైనా ఇబ్బంది కలిగే చాన్స్ ఉంటుందా అంటే, అక్కినేని సుమంత్ మాట్లాడుతూ ఓపెనింగ్స్ విషయంలో, ముఖ్యంగా ఫర్స్ట్ షోకి ఏమైనా కాస్త ఆ ఇంప్యాక్ట్ ఉండవచ్చు కానీ, ఎలాగూ సెలవే కనుక ఆ ప్రభావం పెద్దగా ఉండదు అనేది సుమంత్ ఆలోచన. సినిమా నిర్మాతలను, డిస్‌ట్రిబ్యుటర్స్ ని ముందే అడిగి వారి ఆలోచన ప్రకారమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం అని అంటున్నారు సుమంత్.
ఇక మరో పక్క అసలే ఎన్నికల వేడి మంచి రంజు మీద ఉన్న, తాజాగా జరిగిన రేవంత్ అరెస్ట్ తో వేడి మరింత పెరిగింది. ఈ లెక్కల్లో 7 ఎన్నికలు, 11 కౌంటింగ్ అంటే ఆ రెండు రోజులు ప్రజలు టీవీలకు అతుక్కుని కూర్చుంటారు. మరి ఏ లెక్కల్లో చూసుకున్నా ఆ రెండు రోజులు ఈ సినిమాలకు కాస్త ఇబ్బందికర పరిణామంగానే చెప్పవచ్చు. మరి ప్రేక్షకులు ఏం చెయ్యబోతున్నారో, సుమంత్ చెప్పినట్లు పెద్ద ప్రభావం ఏమీ ఉండదో, లేక ఈ హడావిడిలో పడి సినిమాలను పెద్దగా పట్టించుకోరో చూద్దాం.



